Asianet News TeluguAsianet News Telugu

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Can NTR Helps Balayya To Collect 200 crs?
Author
Hyderabad, First Published Dec 29, 2018, 3:28 PM IST

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ గొప్ప వ్యక్తి జీవిత చరిత్ర అందరికీ తెలియాలని ఈ సినిమా తీస్తున్నట్లు, దీని ద్వారా ఎటువంటి లాభాలు ఆర్జించడం లేదని నందమూరి బాలకృష్ణ చెబుతున్నప్పటికీ ఈ సినిమాకి వచ్చే కలెక్షన్లపై దృష్టి పెట్టడానికి చాలా మంది సిద్ధమయ్యారు.

బాలకృష్ణతో నటించిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా యాభై కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఆ సినిమాను డైరెక్ట్ చేసింది కూడా దర్శకుడు క్రిషే.. మరిసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా.. పైగా ఎన్టీఆర్ బయోపిక్.. అందులోను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందనే విషయంపై ఆసక్తి పెరిగిపోయింది. ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఇప్పటికే సినిమాపై కావాల్సిన దానికంటే ఎక్కువ హైప్ పెరిగిపోయింది.

ఎలా లేదన్నా.. ఎన్టీఆర్ 'కథానాయకుడు' పార్ట్ ద్వారా రూ.70 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి. అలానే ఫిబ్రవరిలో విడుదల కానున్న ఎన్టీఆర్ 'మహానాయకుడు' సినిమా రూ.50 నుండి 70 కోట్ల వరకు రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా తమిళం, హిందీ భాషల్లో కనీసం పది నుండి ఇరవై కోట్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి.

ఓవర్సీస్ కూడా కలుపుకుంటే మొత్తం సినిమా కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద రూ.160 కోట్లు దాటిపోవడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్ మొత్తం కలుపుకుంటే మరో నలభై నుండి యాభై కోట్లు రావొచ్చు. సో.. మొత్తంగా చూసుకుంటే గనున ఈ సినిమా రూ.200 కోట్ల మార్క్ ని చేరుకోవడం ఖాయమనే అనిపిస్తోంది. మరి ఎన్టీఆర్ ఆ రేంజ్ లాభాలను రాబట్టగలడో లేదో.. చూడాలి!

సంబంధిత వార్తలు.. 

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?

తెలుగు వాడి దెబ్బేంటో చూపించాల్సిన అవసరముంది.. బాలకృష్ణ కామెంట్స్!

బాబాయ్ లో తాతగారిని చూసుకున్నా: ఎన్టీఆర్

అది బాలయ్యకే సాధ్యం: కళ్యాణ్ రామ్

ప్రతివాడు జీవితచరిత్రలు రాసుకుంటామంటే కుదరదు: బ్రహ్మానందం!

ఎన్టీఆర్ బయోపిక్ 12సార్లు చూస్తా.. దర్శకేంద్రుడి వాగ్దానం!

భల్లాలదేవుడి తరువాత ఈ పాత్ర ఊహించలేదు: రానా దగ్గుబాటి!

'ఎన్టీఆర్' ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యాను.. విద్యాబాలన్!

నందమూరి వంశానికి లంచం అనే పదం తెలియదు: మోహన్ బాబు!

'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్..!

లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!

'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!

'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!

ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?

ఎన్టీఆర్ పై పెథాయ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్!

Follow Us:
Download App:
  • android
  • ios