Asianet News TeluguAsianet News Telugu

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు రిలీజ్ డేట్ రానే వచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా నేడు భారీగా రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ముందుగానే అమెరికాలో సినిమా ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. ఎప్పుడు లేని విధంగా బాలయ్య సినిమా యూఎస్ లో అత్యధిక స్క్రీన్స్ లలో ప్రదర్శించడం జరిగింది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ బయోపిక్ ఫస్ట్ టాక్ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

Ntr premiere show talk
Author
Hyderabad, First Published Jan 9, 2019, 5:43 AM IST

దర్శకుడు క్రిష్ ఎక్కువగా కాంట్రవర్సీ జోలికి వెళ్లకుండా కథను ఒక క్రమపద్ధతిలో అల్లుకుంటు వెళ్లాడనే చెప్పాలి. బాలకృష్ణ నటన, ఆయన తండ్రి పాత్రలను విభిన్న వేషధారణలో చూపించడం మెయిన్ హైలెట్ కాగా సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఎమోషనల్ గా ఉంది.  1984 మద్రాస్ లో బసవతారకం ట్రీట్మెంట్ తో సినిమా కథ మొదలవుతుంది. హరికృష్ణ గా కళ్యాణ్ రామ్ ఫస్ట్ ఎంట్రీ బావుంది. ఇక సడన్ గా అప్పుడే సినిమా 1947 ఫ్లాష్ బాక్ కి మారుతుంది.

రిజిస్టర్ గా ఉన్న ఎన్టీఆర్ ఒక్కసారిగా జాబ్ కి రిజైన్ చేసి సినిమా అవకాశాల కోసం వేట సాగిస్తుంటారు. ఈ క్రమంలో అవకాశాలను అందుకుంటూ వెళ్లడం బ్యాక్ గ్రౌండ్ లో ఘన కీర్తి సాంద్ర పాట అద్భుతంగా ఉంటుంది.  మాయ బజార్ సీన్స్ కూడా సినిమాలో మరో హైలెట్. అలనాటి నటీనటులు ఒక్కొక్కరు అద్భుతమైన నటనతో సినిమాకు ప్రాణం పోశారనే చెప్పాలి.

ఇక అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీఆర్ కి సంబంధించిన సన్నివేశాలు కూడా దర్శకుడు క్రిష్ చాలా బాగా తెరకెక్కించాడు. ఇంటర్వెల్ టైమింగ్ లో ఎన్టీఆర్ పెద్ద కొడుకు మరణానికి సంబంధించిన సీన్స్ హెవీ ఎమోషనల్ గా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ ఎండింగ్ 10 నిమిషాలు దర్శకుడు క్రిష్ తన మార్క్ ఎమోషన్ ని ఎలివేట్ చేశాడనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న సినిమాల కు సంబంధించిన సీన్స్ ని ఎక్కువగా ఉంటాయి.  ఎన్టీఆర్ డైరెక్ట్ చేసిన దాన వీర్ శుర కర్ణ లోని భలరే విచిత్రం లో బాలకృష్ణ - శ్రీయ స్క్రీన్ ప్రజెన్స్ సూపర్బ్. 

ఇక యమగోల - అడవిరాముడు సినిమాలకు సంబంధించిన ట్రెండ్ సెట్ సాంగ్స్ అలరిస్తాయి. అనంతరం ఎన్టీఆర్ పొలిటికల్ ఐడియాలజీ సీన్స్ సినిమా కథలో కరెక్ట్ టైమింగ్ లో వస్తాయి. అప్పుడే నారా చంద్రబాబు గా రానా ఎంట్రీ ఇస్తాడు. తెలుగుదేశం పార్టీ అధికారిక ప్రకటనతో సినిమా ఎండ్ అవుతుంది.

సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన హైలెట్ పాయింట్స్ సెట్స్.. ఆ నాటి వాతావరణాన్ని ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్లుగా దర్శకుడు తీసుకున్న జాగ్రత్తలు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక పాత్రల ఎంపిక విధానం కూడా బావుంటుంది. అయితే సినిమాలో కొన్ని సీన్స్ బోరింగ్ గా అనిపించినప్పటికి ఆ సీన్స్ చూపించక తప్పదు. బాలకృష్ణ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ప్రధానంగా కీరవాణి బాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలో హైలెట్ అని చెప్పవచ్చు. సినిమా యావరేజ్ టాక్ వస్తుందా లేదా అనేది మన ఆడియేన్స్ అంచనాలను బట్టి తెలుస్తుంది.

సంబంధిత వార్తలు.. 

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?

Follow Us:
Download App:
  • android
  • ios