Asianet News TeluguAsianet News Telugu

కథానాయకుడు సినిమా: నాదెండ్లతో ఎన్టీఆర్ పరిచయానికే పరిమితం

ఎన్టీఆర్ పార్టీని ఏర్పాటు చేసే సమయంలో  నాదెండ్ల భాస్కర్ రావు కీలకంగా వ్యవహరించారు. అయితే నాదెండ్లకు, ఎన్టీఆర్‌కు మధ్య పరిచయం ఎలా జరిగింది, వీరిద్దరు తొలుత ఎక్కడ కలుసుకొన్నారు, 

nadendla bhaskara rao role in kathanayakudu cinema
Author
Amaravathi, First Published Jan 9, 2019, 1:42 PM IST

హైదరాబాద్: ఎన్టీఆర్ పార్టీని ఏర్పాటు చేసే సమయంలో  నాదెండ్ల భాస్కర్ రావు కీలకంగా వ్యవహరించారు. అయితే నాదెండ్లకు, ఎన్టీఆర్‌కు మధ్య పరిచయం ఎలా జరిగింది, వీరిద్దరు తొలుత ఎక్కడ కలుసుకొన్నారు, పార్టీ ఏర్పాటు ప్రకటనకు సంబంధించి నాదెండ్ల ఎలాంటి ఏర్పాట్లు చేశారనే విషయాలను ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో చూపించారు.

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ నటించి రూపొందించిన కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ రాజకీయపార్టీ ప్రకటన చేసేవరకు తెరకెక్కించారు. తెలుగు సినీ రంగాన్ని శాసించిన ఎన్టీఆర్ ప్రజలకు సేవ చేసే ఉద్దేశ్యంతో టీడీపీని ఏర్పాటు చేశారు.టీడీపీ ఏర్పాటు విషయంలో నాదెండ్ల భాస్కర్‌రావు ఏ రకంగా వ్యవహరించారనే విషయాలను కూడ ఈ  సినిమాలో చూపించారు.

సర్ధార్ పాపారాయుడు సినిమా షూటింగ్  జరుగుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశ్యంతో  ఎన్టీఆర్ తన మనసులోని మాటలను బయటపెట్టారు. ప్రజా సేవకు అంకితం కానున్నట్టు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

అయితే అదే సమయంలో  తన చిన్ననాటి మిత్రుడు భవనం వెంకట్రామ్‌రెడ్డి  ఉమ్మడి ఏపీ సీఎంగా ప్రమాణ కార్యక్రమానికి ఎన్టీఆర్ కూడ హాజరయ్యారు.రాజ్‌భవన్‌లో భవనం వెంకట్రామ్‌రెడ్డి ఆ సమయంలో నాలుగో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈ సమయంలో చంద్రబాబునాయుడుతో కలిసి ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

రాజ్‌భవన్‌లో భవనం వెంకట్రామ్ రెడ్డి ప్రమాణం చేసిన సమయంలో  ముందు వరుసలో కూర్చొన్న ఎన్టీఆర్ పక్కనే నాదెండ్ల భాస్కర్ రావు కూడ ఉన్నారు.ఆ సమయంలోనే  కాంగ్రెస్ పార్టీ సంస్కృతిని నాదెండ్ల భాస్కర్ రావు ప్రస్తావించినట్టుగా ఈ సినిమాలో చూపించారు. 

ఇప్పటికే నాలుగో ముఖ్యమంత్రిగా భవనం వెంకట్రామ్ ప్రమాణం చేశారని.. నాలుగు నెలల కాలానికి భవనం వెంకట్రామ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నారని నాదెండ్ల భాస్కర్ రావు అంటారు.కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అంటూ ఆయన వ్యాఖ్యలు చేసినట్టు తెరకెక్కించారు.

అదే సమయంలో  తాను నాదెండ్ల భాస్కర్ రావు అంటూ ఎన్టీఆర్‌తో ఆయన పరిచయం చేసుకొంటారు. రాజకీయాల్లోకి వచ్చే విషయమై భాస్కర్ రావు ఎన్టీఆర్‌ను అడిగినట్టుగా చూపారు.

ప్రజా సేవకు అంకితం కావాలని  ఎన్టీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. ఈ సమయంలోనే నాదెండ్ల భాస్కర్ రావు పలు దఫాలు ఎన్టీఆర్‌తో చర్చించారు. ఎన్టీఆర్ మద్రాసులో ఉన్న సమయంలోనే నాదెండ్ల భాస్కర్ రావు, రామోజీరావుతో  ఎన్గీఆర్ ఫోన్లో మాట్లాడినట్టుగా సన్నివేశాలను రూపొందించారు.

ఎమ్మెల్యే క్వార్టర్‌లో పార్టీ ఏర్పాటు చేయాలని నాదెండ్ల భాస్కర్ రావును ఎన్టీఆర్ కోరినట్టుగా సినిమాలో చూపారు. తనతో పాటు తన సహచరులంతా కూడ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ వద్ద ప్రస్తావించినట్టు చూపారు. ఎమ్మెల్యే క్వార్టర్ వద్ద మైక్ ఏర్పాటు చేయాలని నాదెండ్లను కోరుతారు.

ఆ సమయంలోనే తన అభిమానులతో ఎన్టీఆర్ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటిస్తారు. పార్టీ పేరు కూడ తెలుగుదేశం అంటూ ఎన్టీఆర్ ప్రకటిస్తారు. ఆ సమయంలో ఎన్టీఆర్ పక్కనే నాదెండ్ల భాస్కర్ రావు ఉన్న విషయాన్ని ఈ సినిమాలో చూపారు.

అయితే ఈ సినిమాలో తన పాత్రను నెగిటివ్ గా చూపుతారనే సమాచారం ఉందని ఈ విషయమై నోటీసులు కూడ పంపినట్టు  నాదెండ్ల భాస్కర్ రావు ఇదివరకే ప్రకటించారు. కథానాయకుడు సినిమాలో మాత్రం నాదెండ్ల భాస్కర్ రావు రోల్‌ను నెగిటివ్‌గా చూపలేదు.మహా నాయకుడు సినిమాలో ఎక్కువగా రాజకీయాల ప్రస్తావన ఉండే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాలో నాదెండ్ల భాస్కర్ రావు రోల్‌‌ ఎలా తెరకెక్కిస్తారో అనే ఆసక్తి నెలకొంది.

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో వైఎస్ పాత్ర ఇలా...

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

 

Follow Us:
Download App:
  • android
  • ios