హైదరాబాద్: టీడీపీని ఏర్పాటు చేసే ముందు రామోజీరావు పాత్ర ఏమిటీ? ఎన్టీఆర్ రామోజీరావు మధ్య ఎలాంటి సంభాషణలు చోటు చేసుకొన్నాయి?ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేసే ముందు ఎవరెవరితో మాట్లాడాడు, ఎక్కడ మాట్లాడాడనే అంశాలను ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమాలో బాలకృష్ణ  తెరకెక్కించారు.

సినీ రంగంలో బిజీగా ఉన్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని సర్ధార్ పాపారాయుడు సినిమా షూటింగ్ సమయంలో అనుకొన్నారు. ఈ విషయాన్ని మీడియాకు చెప్పారు. షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్  మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేయగానే ఏపీ నుండి వేలాది ఉత్తరాలు ఎన్టీఆర్‌కు వచ్చినట్టు సినిమాలో తెరకెక్కించారు.

ఏపీ రాష్ట్రంలో ఆ సమయంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు తమ బాధలను చెప్పుకొంటూ ప్రజలు లేఖలు రాశారు.  ఈ లేఖలను చదివిన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయానికి వచ్చారు. తిరుపతికి వచ్చిన భక్తులు మద్రాసులో ఉండే ఎన్టీఆర్‌ను చూసేందుకు వచ్చిన సమయంలో  ఏపీలో చోటు చేసుకొన్న పరిస్థితులను ఎన్టీఆర్‌కు ఏకరువు పెట్టేవారని ఈ సినిమాలో చూపించారు.

భవనం వెంకట్రామ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్టీఆర్ హాజరయ్యారు. ఆ సమయంలోనే నాదెండ్ల భాస్కర‌రావుతో ఎన్టీఆర్‌కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ఆ తర్వాత పార్టీ ఏర్పాటు వరకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి వ్యతిరేకంగా నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్ వద్ద వ్యాఖ్యలు చేసినట్టుగా ఈ సినిమాలో చూపారు.

రాజకీయపార్టీ ఏర్పాటు విషయమై చర్చలు సాగుతున్న తరుణంలో  ఈనాడు దినపత్రిక అధినేత రామోజీరావు ఎన్టీఆర్‌ను కలిసి ఈ విషయమై చర్చించినట్టుగా ఈ సినిమాలో చూపించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా  తాను కూడ పత్రికను ఏర్పాటు చేసిన విషయాన్ని రామోజీరావు వ్యాఖ్యానించినట్టుగా ఈ సినిమాలో తెరకెక్కించారు.

ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేయడానికి  ముందు  రామోజీరావుతో ఫోన్లో మాట్లాడినట్టుగా సినిమాలో చూపారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నాదెండ్ల భాస్కర రావుకు చెప్పాలని రామోజీరావుతో ఎన్టీఆర్ మాట్లాడినట్టుగా  ఈ సినిమాలో సన్నివేశాలను చిత్రీకరించారు. 

సంబంధిత వార్తలు

కథానాయకుడు సినిమా: నాదెండ్లతో ఎన్టీఆర్ పరిచయానికే పరిమితం

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో వైఎస్ పాత్ర ఇలా...

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?