Asianet News TeluguAsianet News Telugu

కథానాయకుడు సినిమాలో టీడీపీ ఆవిర్భావ నేపథ్యమిదీ...

తెలుగు సినీ రంగానికి రారాజుగా వెలుగొందిన ఎన్టీఆర్ .....  ప్రజలను బాధలను స్వయంగా చూసి వాటిని రూపుమాపేందుకు రాజకీయాల్లోకి రావాలని భావించారు. 

why ntr started tdp in 1982
Author
Amaravathi, First Published Jan 9, 2019, 4:50 PM IST


అమరావతి: తెలుగు సినీ రంగానికి రారాజుగా వెలుగొందిన ఎన్టీఆర్ .....  ప్రజలను బాధలను స్వయంగా చూసి వాటిని రూపుమాపేందుకు రాజకీయాల్లోకి రావాలని భావించారు. అయితే రాజకీయాల్లోకి రావాలని ఎన్టీఆర్ ఒక్క రోజులో నిర్ణయం తీసుకోలేదు.  ప్రజల బాధలను స్వయంగా చూసిన ఎన్టీఆర్‌ను కొన్నిఘటనలు  రాజకీయాల్లోకి వచ్చేలా పురిగొల్పాయి. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు ఆదుకోవడంలో ఎన్టీఆర్ ముందుండేవాడు. తనతో పాటు తన తోటి కళాకారులను కూడ ఆయన ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యుల్ని చేసేవారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అవలంభించిన విధానాలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను  స్వయంగా చూసిన ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ అంశాలను కథానాయకుడు సినిమాలో ప్రస్తావించారు.

1947లో  సబ్‌రిజిష్ట్రార్ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఎన్టీఆర్ సినిమాల్లో వేషాల కోసం మద్రాసు వెళ్లాడు. ఎల్వీ ప్రసాద్  రాసిన ఉత్తరాన్ని తీసుకొని మద్రాసు వెళ్తాడు. ఎల్వీ ప్రసాద్‌ కొందరు దర్శకులు, నిర్మాతలకు ఎన్టీఆర్‌ను పరిచయం చేసినట్టుగా ఈ సినిమాలో చూపారు.

సినీ నటుడుగా ఎన్టీఆర్ బిజీగా ఉన్న సమయంలోనే  రాయలసీమ ప్రాంతంలో  కరువు నెలకొంది. ఈ తరుణంలోనే తన తోటి కళాకారులతో  కలిసి విరాళాలు పోగేసి సీఎం సహాయనిధికి  అందిస్తారు.

ఆ సమయంలోనే విజయ సంస్థ అధినేత నాగిరెడ్డి  ఎన్టీఆర్‌ను మందలిస్తాడు. డైరెక్టుగా జనంలోకి వెళ్లి విరాళాలు పోగు చేయడం వల్ల సినిమాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని నాగిరెడ్డి అభిప్రాయపడతాడు. 

దీంతో ఆ సంస్థను వదులుకొని ఎన్టీఆర్ వస్తాడు. ప్రజలు ఆపదలో ఉంటే సహాయం చేసేందుకు వసూలు చేసిన విరాళాలను రామకృష్ణ మఠం ద్వారా సీఎం సహాయనిధికి అందేలా ఏర్పాట్లు చేయిస్తారు ఎన్టీఆర్. ఈ సన్నివేశాలను ఈ సినిమాలో చూపారు.

ఆ తర్వాత దివిసీమ ఉప్పెన సమయంలో కూడ ఎన్టీఆర్ ఇబ్బందిపడిన ప్రజల కోసం విరాళాలను సేకరిస్తారు. ఎన్టీఆర్, ఎన్నాఆర్‌లు కలిసి ఈ సమయంలో విరాళాలు పోగేస్తారు. వీరిద్దరూ కూడ ఈ సమయంలో ఊరూరా తిరిగి ప్రజల నుండి విరాళాలను  సేకరిస్తారు. ఈ ఇధ్దరు అగ్ర హీరోలు ఆ సమయంలో సుమారు రూ.13లక్షలను సేకరించి అప్పటి స్పెషలాఫీసర్ మోహన్ కందాకు అందిస్తారు. ఈ సన్నివేశాలను చిత్రంలో చూపారు.

దివిసీమ ఉప్పెన సమయంలోనే గ్రామాల్లో విరాళాల కోసం పర్యటిస్తున్న సమయంలో  ఓ మహిళ తన తల్లి ఎన్టీఆర్ వీరాభిమాని అంటూ ఆమె కనీసం ఒక్కసారైనా ఎన్టీఆర్‌ను కళ్లారా చూడాలని భావిస్తోందని కళ్లనీళ్లు పెట్టుకొంటుంది. ఆ మహిళ అడ్రస్ తెలుసుకొని ఆ ఇంటికి వెళ్లినట్టుగా ఈ సినిమాలో సన్నివేశాలున్నాయి.

ఎన్టీఆర్‌ను చూడగానే  ఆ మహిళ తల్లి సంతోషంగా పెట్టే రాగి సంకటి తింటాడు. ఆ ఇంట్లో శ్రీకృష్ణుడి వేషధారణలో ఎన్టీఆర్ ఫోటో‌కు పూజలు అందుకొంటున్న విషయాన్ని ఎన్టీఆర్ చూసి ఖిన్నుడౌతాడు.వరి అన్నం తినడం తమ జీవితంలో అమూల్యమైందిగా ఎన్టీఆర్ అభిమాని చెప్పడం ఆయనను బాధించినట్టుగా చూపారు.

పద్మశ్రీ అవార్డు తీసుకొంటున్న సమయంలోనే ఎన్టీఆర్ ఇందిరాగాంధీ వద్ద తెలుగు రాష్ట్రం గురించి ఆవేశంగా చెబుతాడు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడాన్ని ఎన్టీఆర్ వ్యతిరేకించారు. యమగోల సినిమాలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సెటైరికల్ సంభాషణలు, సీన్లను పెట్టించినట్టుగా ఈ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయి.

సర్దార్ పాపారాయుడు సినిమా షూటింగ్ సమయంలో నెలలో సగం రోజులు సినిమాకు, సగం రోజులు రాజకీయాలకు సమయాన్ని కేటాయించనున్నట్టు ఎన్టీఆర్ ప్రకటించారు. రాజకీయాల్లో ప్రవేశించాలనే మనస్సులో ఎన్టీఆర్ భావిస్తున్న తరుణంలోనే దాసరి నారాయణరావు సర్ధార్ పాపారాయుడు సినిమా షూటింగ్ ప్రారంభమైందని కథానాయకుడులో చూపారు.

 రాజకీయరంగ ప్రవేశం చేస్తానని చూచాయగా వెల్లడించిన సమయంలో  30 మూటల నిండా ఎన్టీఆర్‌కు  ఉత్తరాలు వచ్చాయి. ఈ ఉత్తరాల్లో తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు పడుతున్న బాధలను ప్రజలు ఏకరువు పెట్టారు. 

ముఖ్యమంత్రి అంజయ్యను అవమానించిన ఘటనను ప్రస్తావించారు.  అదే సమయంలో  భవనం వెంకట్రామ్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమానికి చంద్రబాబుతో కలిసి హాజరైన ఎన్టీఆర్‌కు నాదెండ్ల భాస్కర‌రావుతో పరిచయం ఏర్పడుతోంది. ఆ తర్వాత రామోజీరావు కూడ ఎన్టీఆర్‌తో సమావేశమైనట్టుగా ఈ సినిమాలో చూపారు.

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు పార్టీ ఏర్పాటు చేయాలనుకొన్న అంశాలపై రామోజీరావుతో ఎన్టీఆర్ చర్చించినట్టుగా చూపుతారు. చివరగా నాదెండ్ల భాస్కరరావును ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని  రామోజీరావుకు ఎన్టీఆర్ ఫోన్లో చెప్పడం కూడ సినిమాలో ఉంది. ఎన్టీఆర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో  అభిమానుల మధ్య టీడీపీని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించినట్టుగా చూపించారు.


సంబంధిత వార్తలు

కథానాయకుడు సినిమా: ఇందిరాగాంధీతో ఎన్టీఆర్ ఫస్ట్ ఎన్‌కౌంటర్

కథానాయకుడు సినిమాలో రామోజీ పాత్ర ఇదీ....

కథానాయకుడు సినిమా: నాదెండ్లతో ఎన్టీఆర్ పరిచయానికే పరిమితం

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో వైఎస్ పాత్ర ఇలా...

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

 

Follow Us:
Download App:
  • android
  • ios