నందమూరి బాలకృష్ణ పద్దతులు బాగా ఫాలో అవుతుంటారు. ఆయన ఏ కార్యక్రమం చేపట్టాలన్నా.. ముహూర్తం ఉండాల్సిందే. తెల్లవారు జామున లేచే దగ్గర నుండి పనులన్నీ చేసుకునేవరకు ముహూర్తాలు చూస్తూనే ఉంటాడు బాలయ్య.

ఆయన సినిమాల ఆడియో ఫంక్షన్లు, రిలీజ్ లు కూడా ముహుర్తానికే జరుగుతుంటాయి. తన సినిమాల తొలి షోకి కూడా బాలయ్య ముహూర్తం ఫాలో అవుతారు. బాలయ్య పెట్టిన ముహుర్తానికే ఆయన సినిమాల ప్రీమియర్లు కూడా పడుతుంటాయి.

మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ 'కథానాయకుడు'కి కూడా బాలయ్య ముహూర్తం పెట్టేశారు. ఈ నెల 9న ఉదయం 5 గంటలకు షో పడాలని ముహూర్తం పెట్టారు. అదే సమయంలో హైదరాబాద్ భ్రమరాంబలో ప్రత్యేకమైన షో వేయనున్నారు.

నిజానికి హైదరాబాద్ లో ప్రీమియర్ షోలకు అనుమతి లేదు.. కానీ బాలయ్య కోసం ఆ ఒక్క థియేటర్ లోనే తెల్లవారుజామున షోకి అనుమతి తీసుకున్నారు. ఆ షోకి బాలయ్యతో పాటు సినిమా టీమ్ హాజరు కానుంది. ఆంద్రలో అయితే 5గంటల కంటే ముందే షోలు పడే అవకాశాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు.. 

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?