ప్రజా కూటమి( మహాకూటమి)లో సీట్ల సర్ధుబాటు విషయమై ఇంకా ఫైనల్ కాలేదు.
హైదరాబాద్: ప్రజా కూటమి( మహాకూటమి)లో సీట్ల సర్ధుబాటు విషయమై ఇంకా ఫైనల్ కాలేదు. సీట్ల సర్దుబాటు ఇంకా పూర్తి కాకపోవడంతో కాంగ్రస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. రాహుల్‌తో ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కుంతియా సోమవారం నాడు సమావేశం కానున్నారు.
తెలంగాణ అసెంబ్లీలో ఉ 119 సీట్లున్నాయి, 74 సీట్లకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఫైనల్ చేసింది. కానీ, మిత్రపక్షాల సీట్ల సర్దుబాటు విషయం ఫైనల్ కాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు విషయమై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా రాహుల్ కు వివరించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్‌తో వీరిద్దరూ చర్చించనున్నారు.
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం సాయంత్రం టీజేఎస్ చీఫ్ కోదండరామ్, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రజా కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయమై చర్చించారు.
టీజేఎస్‌కు 8 సీట్లు, సీపీఐకు3, టీడీపీకి 14, తెలంగాణ ఇంటి పార్టీకి 1 సీటును కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. అయితే ఏఏ స్థానాలను మిత్రపక్షాలను కేటాయించాలనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు విషయమై ఇంకా స్పష్టత రాకపోవడంపై రాహుల్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. వరంగల్ ఈస్ట్, స్టేషన్‌ఘన్‌పూర్, సిద్దిపేట,వర్ధన్నపేట,మల్కాజిగిరి,రామగుండం, సికింద్రాబాద్, మెదక్, చాంద్రాయణగుట్ట సీట్లను టీజేఎస్ కోరింది. కానీ నాలుగు సీట్ల విషయంలో మాత్రం కాంగ్రెస్, టీజేఎస్ మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. సీపీఐ మాత్రం తమకు కనీసం 5 స్థానాలు ఇవ్వాలని పట్టు పడుతోంది. ఇప్పటికే ఈ ఐదు స్థానాలను కూడ సీపీఐ ప్రకటించింది.అభ్యర్థులను కూడ ప్రకటించనున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది.
ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీనివాసన్, రాష్ట్ర నేత గూడూరు నారాయణరెడ్డి ఆదివారం నాడు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో చర్చించారు. కొత్తగూడెం, బెల్లంపల్లి, వైరా, హుస్నాబాద్ సీట్లను సీపీఐ కోరుతోంది. కొత్తగూడెం మినహా మిగిలిన మూడు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉంది. కొత్తగూడెం సీటు లేకుండా పొత్తులు అవసరం లేదనేది సీపీఐ వాదనగా ఉంది.
ఈ పరిస్థితులను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీకి వివరించనున్నారు. కూటమి నుండి ఏ పార్టీ కూడ బయటకు వెళ్లకుండా చూడాలని రాహుల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌కు వివరించనున్నారు.
సంబంధిత వార్తలు
సీట్ల లొల్లి: టీడీపీ పోటీచేసే సీట్లివే, నాలుగు సీట్లపై కుదరని ఏకాభిప్రాయం
కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు: రాహుల్‌గాంధీ అసహనం
కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు
మహాకూటమిలోనే ఉంటాం, విడిపోం:చాడ
మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు
ప్రచారం చెయ్యాల్సిన సమయం, సాగదీత వద్దు:కోదండరామ్
కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....
ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ
సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో
సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్
టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్
కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?
కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...
ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్
కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన
పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు
ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్
నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్
రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌కు స్వల్ప ఊరట
సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు
ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14
ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో
కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్, సీపీఐకి కాంగ్రెస్ షాక్
ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు
హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం
టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు
టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే
కోదండరామ్‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్
మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు
మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?
మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ
మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్
మహా కొలిమి: కోదండరామ్ కొర్రీలు
నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్
మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక
మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి
వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్
కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్ కరుణించేనా?