మరికాసేపట్లో ఎంగేజ్మెంట్ ..సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

Published : Nov 12, 2018, 10:09 AM IST
మరికాసేపట్లో ఎంగేజ్మెంట్ ..సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

సారాంశం

మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హైదరాబాద్ నగరంలోని వనస్థలీపురంలో చోటుచేసుకుంది.

మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హైదరాబాద్ నగరంలోని వనస్థలీపురంలో చోటుచేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగరి సమీపంలోని తుక్కుపూర్ ప్రాంతానికి చెందిన నర్సింహ(28) ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

అతను 2012 నుంచి వనస్థలీపురంలోని ఆర్టీసీ కాలనీలో నివసిస్తున్నాడు. కాగా.. కొద్ది రోజుల క్రితమే నర్సింహకు ఉప్పల్ కి చెందిన ఓ యువతితో వివాహం కుదిరింది. ఆదివారం వారిద్దిరికీ కుటుంబసభ్యులు ఎంగేజ్ మెంట్ నిశ్చయించారు.  మరికాసేపట్లో శుభకార్యం నిమిత్తం యువతి ఇంటికి వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే నర్సింహ తన గదిలో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert: మ‌రో 2 రోజులు చుక్క‌లే.. దారుణంగా ప‌డిపోనున్న ఉష్ణోగ్ర‌త‌లు
హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?