కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు

By narsimha lode  |  First Published Nov 10, 2018, 11:36 AM IST

మిత్రపక్షాలతో సీట్ల సర్ధుబాటు అంశం ఇంకా పూర్తి కానందున అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రకటన చేయకపోవచ్చని  ఆ పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.



 హైదరాబాద్:  మిత్రపక్షాలతో సీట్ల సర్ధుబాటు అంశం ఇంకా పూర్తి కానందున అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రకటన చేయకపోవచ్చని  ఆ పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

 తెలంగాణలో  టీఆర్ఎస్‌ను గద్దె దించేందుకు గాను  కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, టీజేఎస్,  టీడీపీ  ప్రజా కూటమి (మహా కూటమి) గా  ఏర్పడ్డాయి. తెలంగాణలోని 119 అసెంబ్లీ సీట్లలో  94 సీట్లలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలని భావిస్తోంది. 26 స్థానాలను  మిత్రపక్షాలకే కేటాయించనుంది.

Latest Videos

టీడీపీకి 14, టీజేఎస్‌కు 8,  సీపీఐకు 3, తెలంగాణ ఇంటి పార్టీకి 1 స్థానం కేటాయించింది. అయితే  మిత్రపక్షాలకు సీట్ల సంఖ్యను  ప్రకటించినా ఆ పార్టీలకే ఏ ఏ స్థానాలను కేటాయించనున్నారనే విషయాన్యి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించలేదు.

టీజేఎస్‌కు మాత్రమే 11 స్థానాల జాబితాను  కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అయితే  ఇందులో కూడ ఆసిఫాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్ సీట్లలో స్నేహాపూర్వక పోటీ ఉంటుందని  కాంగ్రెస్ పార్టీ మెలిక పెట్టింది. ఈ జాబితాపై  టీజేఎస్ అసంతృప్తితో ఉంది.  కొన్ని జిల్లాల్లో తమకు స్థానాలే లేకపోవడంపై ఆ పార్టీ నాయకత్వం  ఆగ్రహంగా ఉంది. 

ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చించాలని  టీజేఎస్ భావిస్తోంది. ఇదిలా ఉంటే సీపీఐ కూడ  కాంగ్రెస్ తీరుతో రగిలిపోతోంది. బెల్లంపల్లి, వైరా, హుస్నాబాద్ సీట్లను కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది.  కానీ,  కొత్తగూడెం స్థానం విషయంలో సీపీఐ  రాజీపడడం లేదు. దీనికి తోడు కనీసం 5 అసెంబ్లీ స్థానాలను  కేటాయించాలని సీపీఐ డిమాండ్ చేస్తోంది.

మూడు అసెంబ్లీ స్థానాలతో పాటు  రెండు ఎమ్మెల్సీలు ఇచ్చినా వద్దని ఆ పార్టీ తేల్చేసింది. నాలుగు అసెంబ్లీ స్థానాలు ఒక్క ఎమ్మెల్సీ స్థానాలకు తొలుత ఒప్పుకొన్నట్టుగా సీపీఐ కన్పించినా... కాంగ్రెస్ పార్టీ లీకేజీల వ్యవహరంతో  సీపీఐ ఆగ్రహంతో ఉంది. 

ఈ తరుణంలో  ప్రజా కూటమిలోని భాగస్వామ్య పార్టీలైన టీజేఎస్  చీఫ్ కోదండరామ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ‌తో  సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సమావేశమయ్యారు.తమ డిమాండ్లను ఇతర పార్టీల ముందుంచారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డితో కూడ చర్చించారు. 

కొత్తగూడెం, వైరా, బెల్లంపల్లి, మునుగోడు, హుస్నాబాద్ స్థానాల్లో  తాము పోటీ చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి శుక్రవారం రాత్రి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ  ఏం స్పందన కోసం సీపీఐ నేతలు  ఎదురుచూస్తున్నారు.ఈ విషయమై సీపీఐ రాష్ట్ర కార్యవర్గం శనివారం నాడు కూడ సమావేశం కానుంది.

ఇదిలా ఉంటే  కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను 74 మంది అభ్యర్థుల పేర్లను  కాంగ్రెస్ పార్టీ  ఈ రోజు ప్రకటించాల్సి ఉంది. కానీ, భాగస్వామ్య పార్టీల సీట్ల సర్ధుబాటు ఇంకా ఫైనల్ కాలేదు.

టీజేఎస్ చీఫ్‌ కోదండరామ్‌తో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లో చర్చించారు.  శనివారం నాడు ఉదయం కోదండరామ్‌తో చర్చించాలని భావించారు. కానీ, దుబాయ్‌ నుండి ఉత్తమ్ ఆలస్యంగా హైద్రాబాద్‌కు రావడంతో  కోదండరామ్‌తో  చర్చలు కొంచెం ఆలస్యమైనట్టు సమాచారం.

సీపీఐ నేతలతో  కాంగ్రెస్ పార్టీ నేతలు కూడ చర్చించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగూడెం సీటు విషయమై అవసరమైతే  కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించి కొత్తగూడెం సీటుపై  తేల్చనున్నారు. కొత్తగూడెంతో పాటు నల్గొండ జిల్లాలోని మునుగోడు లేదా దేవరకొండ సీట్లను సీపీఐ కోరుతోంది.ఈ  సీట్ల విషయమై కాంగ్రెస్ పార్టీ అంత సానుకూలంగా లేదు. 

ఈ పరిమాణాల నేపథ్యంలో  కాంగ్రెస్ పార్టీ జాబితా ప్రకటన ఆలస్యమయ్యే  అవకాశం ఉంది. భాగస్వామ్య పార్టీలతో సీట్ల సర్దుబాటు పూర్తైన తర్వాత ఈ జాబితాను ప్రకటించే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


సంబంధిత వార్తలు

మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు

 

కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....

ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ

సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో

సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?

కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

 

 

click me!