జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్

By pratap reddy  |  First Published Nov 10, 2018, 11:09 AM IST

జనగామ జిల్లా ఏర్పాటు కోసం జరిగిన పోరాటంలో కోదండరామ్ కీలక పాత్ర పోషించారు. ఆ పోరాటానికి తలొగ్గి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జనగామ జిల్లా ఏర్పాటుకు అంగీకరించారు. కోదండరామ్ పోటీ చేస్తే జనగామలో ప్రజా కూటమికి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.


హైదరాబాద్: తెలంగాణ జనసమితి (టిజెఎస్) అధ్యక్షుడు కోదండరామ్ జనగామ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. జనగామ సీటును ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ కోదండరామ్ కు కేటాయించినట్లు సమాచారం. అక్కడి నుంచి పోటీ చేయడానికి కోదండరామ్ కూడా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.

జనగామ జిల్లా ఏర్పాటు కోసం జరిగిన పోరాటంలో కోదండరామ్ కీలక పాత్ర పోషించారు. ఆ పోరాటానికి తలొగ్గి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జనగామ జిల్లా ఏర్పాటుకు అంగీకరించారు. కోదండరామ్ పోటీ చేస్తే జనగామలో ప్రజా కూటమికి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. 

Latest Videos

ప్రస్తుతం జనగామ నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి చెందిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత కూడా ఉంది. 

అయితే, ఈ ప్రతిపాదనపై కాంగ్రెసు నేత పొన్నాల లక్ష్మయ్య తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తనకు కనీసం చెప్పకుండా కోదండరామ్ పేరును ఖరారు చేయడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. బీసీలకు ఇది తీరని అన్యాయమని ఆయన అంటున్నారు. జనగామ నుంచి పోటీ చేయాలని పొన్నాల లక్ష్మయ్య గట్టి అనుకుంటున్నారు. 

ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కీలక నేత హరీష్ రావు పొన్నాల లక్ష్మయ్యతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ జనగామ టికెట్ ను ఖరారు చేస్తే పొన్నాల లక్ష్మయ్య టీఆర్ఎస్ లో చేరుతారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

అయితే, పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెసు అధిష్టానం మరో ఆఫర్ ఇస్తోంది. ఎమ్మెల్సీగా ఎంపిక చేసి డిప్యూటీ సిఎం పదవి ఇస్తామని హామీ ఇస్తున్నట్లు సమాచారం. లేదా రాజ్యసభ ఎంపిక చేయిస్తామని కూడా చెబుతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, టీజెఎస్ కాంగ్రెసు గుర్తు హస్తంపై పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. టీజెఎస్ కు ఎన్నికల సంఘం అగ్గిపెట్టె గుర్తును కేటాయించింది. ఓటర్లు అయోమయానికి గురవుతారనే ఉద్దేశంతో టీజెఎస్ హస్తం గుర్తుపైనే పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

కోదండరామ్ కు ఢిల్లీ పిలుపు: ఎందుకంత ప్రాధాన్యం

సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?

కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

click me!