Asianet News TeluguAsianet News Telugu

దొరసాని రివ్యూ: ఎపి బడ్జెట్ వార్తలు

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

Top stories of the day
Author
Hyderabad, First Published Jul 12, 2019, 6:03 PM IST

'దొరసాని' రివ్యూ!

Dorasani Movie Review and Rating

అనగనగా ఓ డబ్బున్న అమ్మాయి. ఆమెని ఓ పేదింటి అబ్బాయి ప్రేమిస్తాడు. కొంతకాలం డ్యూయిట్స్ గట్రా పాడుకున్నాక, ఈ విషయం ఆమె ఫ్యామిలీలో తెలుస్తుంది. దాంతో  ఆ పిల్ల తండ్రి  ముందుగా  రిహార్సల్ చేసుకున్నట్లుగా   సీన్ లోకి వచ్చి ఠాఠ్...మీ ప్రేమ కథకు నేను గ్రీన్ సిగ్నల్ ఇవ్వను...మీ చావు మీరు ఛస్తానన్నా ఊరుకోను...మా అమ్మాయికు మా కులపోడికే, మాలా డబ్బున్న వాడికే ఇచ్చి పెళ్ళి చేసేస్తాను అని శపధాలు చేస్తాడు.
 

 

'నిను వీడని నీడను నేనే' రివ్యూ!

ninu veedani needanu nene movie review

టాలీవుడ్ లో రొటీన్ కథలతో వచ్చే సినిమాలకు లైఫ్ ఉండడం లేదు. అందుకే స్టార్ హీరోలు సైతం కమర్షియల్ కథలు కాకుండా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలను ఎన్నుకుంటున్నారు. కుర్ర హీరో సందీప్ కిషన్ కూడా ఓ సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన నటించిన 'నిను వీడని నీడను నేనే' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
 

 

ఏపీ బడ్జెట్ 2019-20: ముఖ్యాంశాలు

andhra pradesh cabinet approves budget 2019

2019-2020 ఆర్ధిక సంవత్సరానికి గాను శాసనసభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. శుక్రవారం ఉదయం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం బడ్జెట్‌ను ఆమోదిస్తూ తీర్మానం చేసింది

 

 

చంద్రబాబుకు షాక్: బీజేపీలోకి క్యూ కడుతున్న సుజనాచౌదరి టీం

annam satish jioned bjp in the presence of jp nadda

అన్నం సతీష్ బీజేపీలో చేరడంలో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అలాగే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సైతం అన్నం సతీష్ ను బీజేపీలోకి చేరాలంటూ ఆహ్వానించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే గురువారం పార్లమెంట్ లో  కిషన్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 
 

 

పొగాకు బోర్డు చైర్మన్ గా వై.రఘునాథబాబు

y.raghunathababu appointed as tobacco board chairman

రఘునాథబాబు ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. గత కొంతకాలంగా పొగాకు బోర్డుకు చైర్మన్ లేరు. ఈ నేపథ్యంలో పొగాకు బోర్డు చైర్మన్ గా ఇన్ చార్జి చైర్మన్ కే సునీత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా రఘునాథబాబును చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రప్రభుత్వం. రెండు రోజుల్లో రఘునాథబాబు బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది. 

 

 

బుగ్గన బడ్జెట్: మధ్యతరగతికి ఊరట

ap budget: allocation Rs. 1740 crore for arogyasri

మధ్య తరగతి ప్రజలకు కూడ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింపజేయనున్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. వైద్య ఖర్చుల కోసం ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అండగా నిలవనున్నట్టుగా ఏపీ సర్కార్ స్పష్టం చేసింది.
 

 

బుగ్గన బడ్జెట్‌: రైతాంగానికి పెద్దపీట

ap budget: top priority for agriculture sector

ఏపీ  ప్రభుత్వం వ్యవసాయానికి అనుబంధ రంగాలకు బడ్జెట్‌లో రూ. 20,677 కోట్లను  కేటాయించింది. రైతాంగ సంక్షేమం కోసం తాము కట్టుబడి ఉంటామని ఎన్నికల సభల్లో వైఎస్ జగన్  ప్రకటించారు.  ఈ మేరకు బడ్జెట్‌లో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారు.

 

 

ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తాం: బుగ్గన

we tries for special status to andhra pradesh says buggana rajendranath reddy

అమరావతి: ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు.

 

 

ఇది ఫిష్ మార్కెట్టా...! టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం

ap speaker tammineni sitaram fires on tdp legislators

 టీడీపీ సభ్యులపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం శుక్రవారం నాడు అసహనాన్ని వ్యక్తం చేశారు. అధికార పక్ష సభ్యులు మాట్లాడుతున్న సమయంలో  విపక్షపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గొడవ చేయడంతో  సభలో గందరగోళ వాతావరణం చోటు చేసుకొంది. ఈ సమయంలో  స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ వ్యాఖ్యలు చేశారు.

 

 

భారీ పర్సనాలిటీపై జగన్ వ్యాఖ్యలు: కౌంటరిచ్చిన అచ్చెన్నాయుడు

tdp leader atchannaidu strong counter to ap cm ys jagan over personality comments

రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన ఆయన శుక్రవారం సభలో జగన్ వ్యవహారశైలిపై మండిపడ్డారు.
 

 

సిగ్గు లేకుండా నవ్వుతున్నారు: జగన్ పై చంద్రబాబు వ్యాఖ్య

Chnadrababu comments on YS Jagan

గత టీడీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకానికి పైసా కూడా ఇవ్వలేదని జగన్ అన్నారని,  రాజీనామా చేయాలని తనను సవాల్ చేస్తారని చంద్రబాబు గుర్తు చేశారు. రాజానామా చేయాలని తనను సవాల్ చేస్తారా అని ఆయన మండిపడ్డారు.  సవాల్ చేసి ఇప్పుడు సిగ్గు లేకుండా నవ్వుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

 

 

బాబు ఐదేళ్లలో చేసింది ఇదే: సున్నా వడ్డీలపై లెక్కలు విప్పిన జగన్

ap cm ys jagan speech on zero interest crop loans in ap assembly budget sessions

సున్నా వడ్డీలపై చంద్రబాబు సభలో ప్రసంగించిన దానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కౌంటరిచ్చారు.  బాబు ప్రసంగాన్ని మొదటిసారి విన్న ఎవరికైనా చంద్రబాబు ఎంత గొప్పగా సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేశారోనని అనుకుంటారని సీఎం సెటైర్లు వేశారు. 

 

 

మేం తలుచుకొంటే మీరు అసెంబ్లీలో కూర్చోలేరు: జగన్

Ys jagan serious comments on tdp legislators in assembly

మేం తలుచుకొంటే  మీరు  మాట్లాడలేరని  ఏపీ సీఎం వైఎస్ జగన్ టీడీపీ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టీడీపీ సభ్యులపై ఏపీ సీఎం వైఎస్ జగన్  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూర్చోవయ్యా కూర్చోవయ్యా అంటూ జగన్  టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడుపై వ్యాఖ్యలు చేశారు.
 

 

ఆధారాలతో చెప్పా: జగన్ రాజీనామా చేస్తారా... చంద్రబాబు సవాల్

opposition leader chandrababu naidu challenge to ys jagan

సున్నా వడ్డీ పథకం గురించి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. సున్నా వడ్డీకి సంబంధించి ఆయన సభకు డాక్యుమెంట్లు సమర్పించారు. సున్నా వడ్డీకి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అవాస్తవమని చంద్రబాబు స్పష్టం చేశారు.

 

 

అమిత్ షాతో డిఎస్ భేటీపై కేసీఆర్ ఆరా: దొరికితే వేటు

KCR enquires about DS meeting with Amit Shah

పార్టీ ఫిరాయింపునకు సంబంధించిన ఆధారాల కోసం టీఆర్ఎస్ చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఆధారాలు లభ్యమైతే అనర్హత వేటు కోసం రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయాలని టీఆర్ఎస్ నాయకత్వం అనుకుంటోంది.

 

 

'ఓ బేబీ' తొలి వారం వసూళ్లు.. లాభాల పంటేగా!

Oh Baby first week world wide collections

సమంత నటించిన ఓ బేబీ చిత్రం ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓ బేబీ తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రం కోసం క్యూ కడుతున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో, సురేష్ బాబు నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది. 

 

 

రేణు దేశాయ్ ఆ సినిమాలో ఫిక్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ రైటర్

sai madhav burra about renu desai

రేణు దేశాయ్ టాలీవుడ్ లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వనుంది అనే వార్తలు గత కొంత కాలంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించిన మాట వాస్తవమే అయినప్పటికీ ఆమె ఎంతవరకు ఒప్పుకున్నారు అనే విషయంపై అనుమానాలు మొదలయ్యాయి. 

 

 

''నా కూతురి పెళ్లికి నన్ను పిలవండే..'' హీరోయిన్ తండ్రి సెటైర్లు!

Shakti Kapoor Shoots Down Shraddha's Wedding Rumours

బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్ పెళ్లి చేసుకోబోతుందంటూ కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. శ్రద్ధా చాలా కాలంగా తన స్నేహితుడు రోషన్ శ్రేష్టతో ప్రేమలో ఉందని.. వచ్చే ఏడాది ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతుందని.. శ్రద్ధా తల్లి పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉందని గురువారం నాడు వార్తలు వినిపించాయి.

 

 

ధోనికి మద్దతుగా పూజా పోస్ట్.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

trolling on pooja hegde

న్యూజిలాండ్ తో జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ లో టీమిండియా ఓడిపోవడం భారత క్రికెట్ అభిమానులను ఎంతగానో బాధించింది. గెలుస్తుందనుకున్న మ్యాచ్ కాస్త ఓడిపోవడంతో ఓటమిని తట్టుకోలేకపొతున్నారు. సామాన్యుల దగ్గర నుండి సెలబ్రిటీల వరకు అందరూ బాధపడుతున్నారు.

 

 

''బిగ్ బాస్' ముసుగులో బ్రోతల్ హౌస్ నడుపుతున్నారా..?''

anchor swetha reddy sensational comments on bigg boss show

ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ పై యాంకర్ శ్వేతారెడ్డి సంచనల కామెంట్స్ చేసింది. ''బిగ్ బాస్ షోలో పాల్గొనాలంటే వాళ్ల బాస్ ని ఇంప్రెస్ చేయాలట.. ఉత్తరాది గబ్బు సంస్కృతిని తెలుగు వాళ్లపై రుద్దాలని అనుకుంటున్నారా..? బిగ్ బాస్ ని నిషేధించాలి.. తెలుగు టీవీ నుండి వెలివేయాలి.. బిగ్ బాస్ ముసుగులో నిర్వాహకులు బ్రోతల్ హౌస్ నడుపుతున్నారా..?'' అంటూ యాంకర్ శ్వేతారెడ్డి మండిపడింది.
 

 

పది నిమిషాల కోసం నన్ను వేధించారు.. రష్మిక కామెంట్స్!

rashmika speech at dear comrade movie press meet

'ఛలో' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా తాజాగా కొన్ని కామెంట్స్ చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న 'డియర్ కామ్రేడ్' సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఆమె క్రికెటర్ గా కనిపించనుంది.

 

 

రజినీకి నటించడం వచ్చేది కాదు.. సుహాసిని కామెంట్స్!

suhasini interesting comments on rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ కి తొలి రోజుల్లో నటించడం వచ్చేది కాదని.. ఎక్కువగా భయపడేవారని నటి సుహాసిని వెల్లడించారు. కె.బాలచందర్ 89వ జయంతి కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

 

 

స్టార్ హీరోయిన్ పై చీటింగ్ కేసు!

cheating case filed against sonakshi sinha

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్, మాజీ ఎంపీ శత్రుఘ్నసిన్హా గారాలపట్టి సోనాక్షి సిన్హాపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. గతేడాది ఓ స్టేజ్ ప్రదర్శన ఇవ్వడానికి సోనాక్షి సిన్హా రూ.24 లక్షలు తీసుకొని కార్యక్రమానికి రాలేదని నిర్వాహకులు యూపీలోని కట్ ఘర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 

 

ఫైనల్ గా పెళ్లి చేసుకున్న అమలాపాల్ మాజీ భర్త

al vijay second marriage

అమలాపాల్ మాజీ భర్త, దర్శకుడు ఏఎల్. విజయ్ మొత్తానికి మరో పెళ్లి చేసుకున్నాడు. గత కొంత కాలంగా ఇంటర్నెట్ లో విజయ్ పెళ్లికి సంబందించిన రూమర్స్ ఎన్నో వచ్చాయి. అయితే వాటిపై దర్శకుడు పెద్దగా స్పందించలేదు. ముఖ్యంగా హీరోయిన్ సాయి పల్లవిని సీక్రెట్ గా పెళ్లిచేసుకోబోతున్నట్లు రూమర్స్ వచ్చాయి. 

 

 

డూ ఆర్ డై మ్యాచుల్లో విరాట్ కోహ్లీ పరమ చెత్త బ్యాటింగ్

Virat Kohli fails to deliver in a knockout match yet again, averages just 12.16 in 6 do-or-die ties

చావో రేవో తేల్చుకోవాల్సిన కీలకమైన మ్యాచుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పరమ చెత్తగా ఉంది. ప్రస్తుత ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచులోనే కాదు, గతంలో జరిగిన కీలకమైన టోర్నీల్లో కూడా నాకౌట్ దశలో కోహ్లీ బ్యాటింగ్ చెత్గగానే ఉంది.
 

 

సెమీ ఫైనల్లో ఇండియా ఓటమి: సంజయ్ బంగర్ పై వేలాడుతున్న కత్తి

Team India Assistant Coach Sanjay Bangar Under Scanner After World Cup Exit

ముంబై: ప్రపంచ కప్ టోర్నీ సైమీ ఫైనల్ నుంచే ఇండియా ఇంటి దారి పట్టిన ప్రభావం అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ పై పడే సూచనలు కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ కోచ్ అయిన సంజయ్ బంగర్ పనితీరును బిసిసిఐ విశ్లేషిస్తోంది. ఆయనను తప్పించే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. 

 

 

మా చెత్త ఆట వల్లనే ఓటమి: రోహిత్ శర్మ తీవ్ర ఆవేదన

Our bad play was the reason: Rohit Sharma

తమ జట్టు ప్రపంచ కప్ టోర్నీ సెమీ ఫైనల్ మ్యాచులో ఓడిపోవడంపై టీమిండియా వైఎస్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రారంభంలోని తమ చెత్త అట వల్లనే సెమీ ఫైనల్ మ్యాచులో ఓడిపోయామని ఆయన అంగీకరించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 18 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుంచి ఇంటి దారి పట్టిన విషయం తెలిసిందే. 
 

 

 

బంతి తగలకున్నా, ఔటిచ్చిన అంపైర్: తిట్టుకుంటూ మైదానం వీడిన రాయ్

Jason Roy outburst aimed at umpire after being given out incorrectly

ప్రపంచకప్‌లో అంపైర్ల తప్పుడు నిర్ణయానికి మరో బ్యాట్స్‌మెన్ బలయ్యాడు. ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్‌లో భాగంగా ఆస్ట్రేలియా నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇంగ్లాండ్ దూకుడుగా బ్యాటింగ్ చేసింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios