సమంత నటించిన ఓ బేబీ చిత్రం ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓ బేబీ తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రం కోసం క్యూ కడుతున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో, సురేష్ బాబు నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది. 

తొలి వారం ముగిశాక ఓ బేబీ వసూళ్లు ఇలా ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద సమంత మ్యాజిక్ స్పంష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. తొలి వారం ముగిసేసరికి ఈ చిత్రం 11 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఈ చిత్ర థియేట్రికల్ బిజినెస్ 10 కోట్లవరకు జరిగింది. అంటే ఇప్పటికే బయ్యర్లకు లాభాలు మొదలైపోయాయి. 

నైజాం ఏరియాలో 3.09 కోట్ల షేర్ తో దూసుకుపోతుండగా, గుంటూరులో 48లక్షలు, ఈస్ట్ గోదావరిలో 46లక్షలు, వెస్ట్ లో 38 లక్షలతో ఓ బేబీ వసూళ్లు స్ట్రాంగ్ గా కోనసాగుతున్నాయి. సీడెడ్ లో కూడా ఈ చిత్ర రన్ బాగానే సాగుతోంది. తొలివారంలో అక్కడ ఒక కోటి రాబట్టడం విశేషం. 

ఇక రెండవ వారం కూడా ఓ బేబీకి పోటీ నిచ్చే స్థాయిలో పెద్ద సినిమాలేవీ విడుదల కావడం లేదు. దీనితో నిర్మాతకు లాభాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారా సురేష్ బాబు మంచి లాభాలని ఆర్జించారు.