రేణు దేశాయ్ టాలీవుడ్ లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వనుంది అనే వార్తలు గత కొంత కాలంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒక చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించిన మాట వాస్తవమే అయినప్పటికీ ఆమె ఎంతవరకు ఒప్పుకున్నారు అనే విషయంపై అనుమానాలు మొదలయ్యాయి. 

అయితే డౌట్స్ కి స్టార్ రచయిత సాయి మాధవ్ బుర్ర క్లారిటీ ఇచ్చేశారు. టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ కి మాటలు రాస్తున్న సాయి మాధవ్ ఆ సినిమాపై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదే విధంగా సినిమాలో రేణు దేశాయ్ ని ఒక పాత్ర కోసం అనుకున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. త్వరలోనే ఆ విషయం అందరికి తెలుస్తుందని కూడా చెప్పారు. 

అంటే రేణు దేశాయ్ సినిమాల్లోకి మళ్ళీ తిరిగొచ్చినట్లే అనే ఒక క్లారిటీ వచ్చిందని చెప్పవచ్చు. స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావ్ బయోపిక్ లో బెల్లకొండ శ్రీనివాస్ మెయిన్ లీడ్ లో నటిస్తున్నాడు. దొంగాట ఫెమ్ వంశీ కృష్ణ ఆ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు.