గత టీడీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకానికి పైసా కూడా ఇవ్వలేదని జగన్ అన్నారని, రాజీనామా చేయాలని తనను సవాల్ చేస్తారని చంద్రబాబు గుర్తు చేశారు. రాజానామా చేయాలని తనను సవాల్ చేస్తారా అని ఆయన మండిపడ్డారు. సవాల్ చేసి ఇప్పుడు సిగ్గు లేకుండా నవ్వుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
అమరావతి: సున్నా వడ్డీ పథకంపై అసెంబ్లీలో అధికార వైఎస్సార్ కాంగ్రెసు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యుల మధ్య పలుమార్లు వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇరు పక్షాలు పరస్పరం తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకున్నారు. సున్నా వడ్డీ రుణాలను అమలు చేసినట్టు నిరూపిస్తూ చంద్రబాబు సభలో రికార్డులను ప్రవేశపెట్టారు.
గత టీడీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకానికి పైసా కూడా ఇవ్వలేదని జగన్ అన్నారని, రాజీనామా చేయాలని తనను సవాల్ చేస్తారని చంద్రబాబు గుర్తు చేశారు. రాజానామా చేయాలని తనను సవాల్ చేస్తారా అని ఆయన మండిపడ్డారు. సవాల్ చేసి ఇప్పుడు సిగ్గు లేకుండా నవ్వుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
టీడీపీ హయాంలో రుణాలు రీషెడ్యూల్ చేయలేదని చెప్పారు కరువు మండలాలను ప్రకటించిన తర్వాత రుణాలు రీషెడ్యూల్ అవుతాయని చంద్రబాబు స్పష్టం చేశారు. 2011 బకాయిలను కూడా తాము క్లియర్ చేశామని చెప్పారు. సీఎం ఎందుకు అంత పరుషంగా మాట్లాడారని చంద్రబాబు ప్రశ్నించారు.
రాజీనామా చేసి వెళ్లిపోతారా అంటూ మాట్లాడతారా అని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై చర్చలో గాడిదలు కాశారా అని అంటారా అని ఆయన జగన్ పై మండిపడ్డారు.