అమరావతి: మేం తలుచుకొంటే  మీరు  మాట్లాడలేరని  ఏపీ సీఎం వైఎస్ జగన్ టీడీపీ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టీడీపీ సభ్యులపై ఏపీ సీఎం వైఎస్ జగన్  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూర్చోవయ్యా కూర్చోవయ్యా అంటూ జగన్  టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడుపై వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం నాడు ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా అధికార , విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ వడ్డీలేని రుణాలపై జరిగిన చర్చపై  అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది.

సీఎం జగన్ ప్రసంగిస్తున్న సమయంలో  టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. ఈ విషయమై  సీఎం జగన్  టీడీపీ సభ్యులపై మండిపడ్డారు. కళ్లు పెద్దవి చేసి చూస్తే తాను భయపడనని ఆయన చెప్పారు. పర్సనాలిటీలు పెరిగితే చాలదు... బుద్ది పెరగాలని  సీఎం జగన్  అచ్చెన్నాయుడును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కూర్చోవయ్యా.. కూర్చోవయ్యా అంటూ ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు.

తాము తలుచుకొంటే టీడీపీ సభ్యులు  అసలు అసెంబ్లీలో మాట్లాడరని ఆయన  చెప్పారు. సభలో తాము తలుచుకొంటే  మీరు కుర్చిలో కూడ కూర్చోలేరని జగన్ తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వాళ్లు ఎలా ప్రవర్తిస్తారో టీడీపీ సభ్యులను చూస్తే అర్థమౌతోందన్నారు.

 

సంబంధిత వార్తలు

బుద్ది పెరగలేదు: అచ్చెన్నాయుడుపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు