Asianet News TeluguAsianet News Telugu

ఏపీ బడ్జెట్ 2019-20: ముఖ్యాంశాలు

2019-2020 ఆర్ధిక సంవత్సరానికి గాను శాసనసభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. శుక్రవారం ఉదయం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం బడ్జెట్‌ను ఆమోదిస్తూ తీర్మానం చేసింది

andhra pradesh cabinet approves budget 2019
Author
Amaravathi, First Published Jul 12, 2019, 9:12 AM IST

2019-20 ఆర్ధిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. మేనిఫెస్టో తమకు నియమావళి అని.. మహాత్ముని లక్ష్యాన్ని సాధించే దిశగా బడ్జెట్ ఉంటుందని బుగ్గన తెలిపారు.

ధృడమైన రాజకీయ మార్పు రాష్ట్ర రాజకీయాల్లో మొదలైందని ఆయన స్పష్టం చేశారు. పేదల కన్నీటిని తుడిచే దిశగా ప్రభుత్వ చర్యలు ఉంటాయని.. తాము ప్రకటించిన నవరత్నాల్లో ఒక దృక్పథం కనిపస్తోందన్నారు. 

ఆర్థిక మంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

* 2019 జూలై నుంచి ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి
* ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ మినహాయింపు
*  ఉప్పాడ, జువ్వలదిన్నె, వాడరేవు, నిజాంపట్నంలలో ఫిషింగ్ జెట్టీల ఏర్పాటు
* ఫీజుల క్రమబద్దీకరణ, ప్రైవేట్ విద్యా సంస్థలలోని టీచర్ల  బాగోగులను సంరక్షించడానికి పర్యవేక్షణా కమిటీ ఏర్పాటు
* షెడ్యూల్డ్ కులాలైన మాల, మాదిగ, రెల్లి మరియు ఇతర కులాల కోసం కొత్తగా కార్పోరేషన్లు
* ఇమామ్‌ల వేతనం నెలకు రూ. 10 వేలకు పెంపు
* మౌజామ్‌ల వేతనం నెలకు రూ. 5 వేలకు పెంపు
* పాస్టర్లకు గౌరవ వేతనం రూ. 5 వేలకు పెంపు
* మద్యాపాన నిషేధం కఠినంగా అమలు
* గ్రామస్థాయిలో భూ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు పకడ్బందీ ఏర్పాటు

* చేపలు జెట్టీలు, హార్బర్ల కోసం రూ. 100 కోట్లు
* మత్స్యకార పడవలకు డీజిల్ రాయితీ కింద రూ. 100 కోట్లు
* మత్స్య సంపద అభివృద్ధి కోసం రూ. 60 కోట్లు
* ఎస్సీ మత్య్సకారుల సంక్షేమానికి రూ. 50 కోట్లు

* వైద్య ఖర్చులు రూ. 1,000 అంతకు మించితే ఆరోగ్యశ్రీ వర్తింపు
* బెంగళూరు, చెన్నైలలోని ప్రముఖ ఆస్పత్రుల్లో కూడా వైద్య సేవలు
* ఇంధన శాఖకు రూ. 6,861.03 కోట్లు
* క్రీడలు, యువజన సర్వీసులకు రూ. 329.68 కోట్లు
* సాంకేతిక విద్యకు రూ. 580.29 కోట్లు
* కళలు, సాంస్కృతికానికి రూ. 77.67 కోట్లు
* 108 వైద్య సేవల కోసం రూ. 143.38 కోట్లు
* పాడేరు, గురజాల, విజయనగరంలో కొత్తగా వైద్య కళాశాలలు ఒక్క కాలేజీకి రూ. 66 కోట్లు
* పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రం, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు కోసం రూ. 50 కోట్లు

* మధ్య తరగతి కుటుంబాలకు కూడా ఆరోగ్యశ్రీ
* రూ. 5 లక్షల వార్షికాదాయం వరకు ఆరోగ్యశ్రీ వర్తింపు 
* ప్రతీ మండలానికి ఆరోగ్య శ్రీ అంబులెన్స్
* ప్రభుత్వ ఆసుపత్రుల మౌలిక సదుపాయలకు రూ. 1,500 కోట్లు
* 25 లక్షల గృహాల నిర్మాణానికి  ప్రణాళిక
* కుటుంబంలోని మహిళ పేరుతో హక్కు పత్రాలు

* కడప స్టీల్ ఫ్లాంట్ రూ. 250 కోట్లు
* స్మార్ట్ సిటీలు రూ. 150 కోట్లు
* కడప యాన్యుటీ ప్రాజెక్ట్ రూ. 120 కోట్లు
* పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ రూ. 100 కోట్లు
* ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం జగనన్న విద్యా దీవెన పథకం రూ. 4,963 కోట్లు
* అమరావతి-అనంతపురం హైవే రూ. 100 కోట్లు
* సీఎం కాల్ సెంటర్ రూ. 73 కోట్లు
* ఆర్టీజీఎస్ రూ. 72 కోట్లు
* రాజధాని ప్రాంత సామాజిక భద్రతా నిధి రూ. 65 కోట్లు

* ఆటో డ్రైవర్లకు ఆర్ధిక సాయం రూ. 400 కోట్లు
* పారిశ్రామిక మౌలిక కల్పన రూ. 250 కోట్లు
* సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి వనరుల కోసం రూ. 200 కోట్లు
* పారిశ్రామిక కల్పన కింద రూ. 250 కోట్లు
* పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు రూ. 1500 కోట్లు
* మధ్యాహ్న భోజన పథకానికి రూ. 1,077 కోట్లు
* వైఎస్సార్ పాఠశాలల నిర్వహణ గ్రాంటు రూ. 160 కోట్లు
* అక్షయ పాత్ర ఫౌండేషన్ వంటశాలల నిర్మాణానికి రూ. 100 కోట్లు
* ఎస్సీ సబ్‌ప్లాన్ రూ. 15,000 కోట్లు
* ఎస్టీ సబ్‌ప్లాన్ రూ. 4,988.52 కోట్లు
* బీసీ సబ్ ప్లాన్ రూ. 15,061.64 కోట్లు
* వ్యవసాయం అనుబంధ రంగాలకు రూ. 20,677.08 కోట్లు
* తాగునీరు, వరద నియంత్రణ కింద రూ. 13,139.05 కోట్లు
* ఏపీ ఖనిజాభివృద్ధి శాఖకు రూ. 3,986.05 కోట్లు
* రాష్ట్ర అభివృద్ధి పథకాల అంచనా వ్యయం రూ. 92,050.05 కోట్లు  
* జగనన్న మౌలిక సౌకర్యాల కల్పనకు రూ. 1,500 కోట్లు

* చేనేత కార్మికులకు వైఎస్సార్ భరోసా రూ. 200 కోట్లు
* వైఎస్సార్ గ్రాంట్స్ కింద మతసంస్థలకు సాయం రూ. 234 కోట్లు
* బ్రాహ్మణ కార్పోరేషన్ రూ. 100 కోట్లు
* న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్ రూ. 100 కోట్లు
* న్యాయవాదుల ఆర్ధిక సాయం రూ. 10 కోట్లు
* ఎస్సీలకు వైఎస్సార్ కళ్యాణ కానుక రూ. 200 కోట్లు
* ఎస్టీలకు వైఎస్సార్ గిరి పుత్రిక కల్యాణ కానుక రూ. 45 కోట్లు
* మైనార్టీలకు వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ. 100 కోట్లు
* గ్రామ సచివాలయాలకు రూ. 750 కోట్లు
* మున్సిపల్ వార్డు వాలంటీర్లకు రూ. 280 కోట్లు
* మున్సిపల్ వార్డు సచివాలయాల కోసం రూ. 180 కోట్లు
* ఏపీఎస్ ఆర్టీసీకి ఆర్ధిక సాయం రూ. 1000 కోట్లు
* ఏపీఎస్ ఆర్టీసీ రాయితీల కోసం రూ. 500 కోట్లు
* ఏపీ రహదారుల అభివృద్ధి కార్పోరేషన్‌కు రూ. 260 కోట్లు
* పట్టణ స్వయం సహాయక బృందాలకు వైఎస్సార్ వడ్డీ లేని రుణం రూ. 648 కోట్లు
* డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు రూ. 1,140 కోట్లు

* విత్తన సరఫరా సంస్థ రూ. 200 కోట్లు
* గిడ్డంగులు రూ. 200 కోట్లు
* వైఎస్సార్ అగ్రిటెస్టింగ్ ల్యాబ్స్ రూ. 109.28 కోట్లు
* వ్యవసాయ యాంత్రీకరణ రూ. 100 కోట్లు
* వైఎస్సార్ వడ్డీ లేని రుణాలు రూ. 100 కోట్లు
* రైతు ఆత్మహత్యల పరిహారం రూ. 100 కోట్లు
* డెయిరీ సహకార సంస్థ రూ. 100 కోట్లు
* పశుగ్రాసం రూ. 100 కోట్లు
* గోడౌన్ల నిర్మాణం రూ. 37.54 కోట్లు
* మత్స్యకారుల సంక్షేమం రూ. 410 కోట్లు
* విద్యారంగం రూ. 9,292.8 కోట్లు
* వైఎస్సార్ ఆరోగ్య శ్రీ రూ. 1,740 కోట్లు
* ఆసుపత్రుల్లో వసతులు రూ. 1,500 కోట్లు
* ఆశా వర్కర్ల వేతనాలు రూ. 445.85 కోట్లు
* వైఎస్సార్ గృహవసతి రూ. 5 వేల కోట్లు
* వైఎస్సార్ హౌసింగ్ స్కీమ్ రూ.1,280 కోట్లు
* వృద్ధాప్య, వితంతు పెన్షన్లు రూ. 12,801 కోట్లు
* దివ్యాంగుల పెన్షన్లు రూ. 2,133 కోట్లు
* వైఎస్సార్ కళ్యాణ కానుక రూ. 716 కోట్లు
* కాపు సంక్షేమం రూ. 2 వేల కోట్లు
* అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 1,150 కోట్లు

* నీటిపారుదల శాఖ రూ. 13,139.05 కోట్లు
* పరిశ్రమల శాఖ రూ. 3,986.05 కోట్లు
* ఐటీ రంగం రూ. 453.56 కోట్లు
* కార్మిక శాఖ రూ. 978.58 కోట్లు
* న్యాయశాఖ రూ. 937.37 కోట్లు
* వైఎస్సార్-పీఎం ఫసల్ బీమా యోజన రూ. 1,163 కోట్లు
* ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ రూ.475 కోట్లు
* ఉచిత బోర్లు రూ. 200 కోట్లు

* వ్యవసాయానికి రూ. 18,327.94 కోట్లు
* పశుసంవర్థకం రూ. 1,912.29 కోట్లు
*  బీసీ సంక్షేమం రూ. 7,271.45 కోట్లు
* అటవీ , సైన్స్ అండ్ టెక్నాలజీకి రూ. 446.77 కోట్లు
* ఉన్నత విద్య రూ. 3,021.63 కోట్లు
* విద్యుత్ రంగం రూ. 6,861.03 కోట్లు
* మాధ్యమిక విద్య రూ. 29,772.79 కోట్లు
* పౌర సరఫరాలు రూ. 4,429.43 కోట్లు
* ఆర్ధిక శాఖ రూ. 46,858.81 కోట్లు
* సాధారణ పరిపాలన రూ.1,010.78 కోట్లు
* వైద్య ఆరోగ్యశాఖ రూ. 11,399.23 కోట్లు
* హోంశాఖ రూ. 7,461.92 కోట్లు
* గృహనిర్మాణశాఖ రూ. 3,617.37 కోట్లు

* వైఎస్సార్ రైతు భరోసా రూ. 8,750 కోట్లు
* అమ్మఒడికి రూ. 6,445 కోట్లు
* 9 గంటల ఉచిత విద్యుత్‌కు రూ. 4,525 కోట్లు
* రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
* రూ.2002 కోట్లతో విపత్తు నిర్వహణ నిధి

* ఏపీ బడ్జెట్ అంచనా రూ. 2,27,974 కోట్లు
* రెవెన్యూ వ్యయం: రూ.1,80,475 కోట్లు
* రెవెన్యూ లోటు: రూ.1,778.52 కోట్లు
* మూలధన వ్యయం: రూ.32,293 కోట్లు
* వడ్డీ చెల్లింపులకు: రూ. 8,994 కోట్లు
* 2018-19 బడ్జెట్‌తో పోలిస్తే 19.32 శాతం పెరుగుదల

* అత్యంత దయనీయ ఆర్ధిక పరిస్ధితి వారసత్వంగా వచ్చింది
* వృద్ధి నిజమైతే పేదలు మరింత పేదలుగా ఎందుకు మారారు
*  ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లక్ష్యాలకు రూ.45 వేల కోట్లు అవసరం
* కృష్ణా ఆయుకట్టును స్థిరీకరిస్తాం
* ప్రతీ గ్రామానికి తాగు నీరు
* ఏపీకి ప్రత్యేక హోదాను సాధిస్తాం
* ప్రజా రవాణా వ్యవస్ధను ఎకో ఫ్రెండ్లీ మారుస్తాం
* ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తాం
* జన్మభూమి కమిటీలకు మా ప్రభుత్వానికి ఎంతో తేడా ఉంది
* సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని నిరోధించేందుకు జ్యూడీషియల్ కమీషన్
* గతంలో రెండంకెల వృద్ధిరేటు వాస్తవమా కాదా అన్నది పరిశీలిస్తున్నాం.  

 

ఏపీ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ప్రభుత్వం మార్పు చేసింది. ముందుగా నిర్థారించిన సమయం కంటే గంటన్నర ఆలస్యంగా మధ్యాహ్నం 12.22 నిమిషాలకు రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. సున్నా వడ్డీలపై సభలో ఎక్కువ సేపు చర్చ జరగడంతో సమయం మార్చినట్లుగా తెలుస్తోంది. 

2019-2020 ఆర్ధిక సంవత్సరానికి గాను శాసనసభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. శుక్రవారం ఉదయం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం బడ్జెట్‌ను ఆమోదిస్తూ తీర్మానం చేసింది.

రూ. 2 లక్షల 27 వేల 984 వందల 99 కోట్ల అంచనాతో రూపొందించిన బడ్జెట్‌ను ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శుక్రవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కావడంతో దీనిపై రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ శాసనమండలిలో బడ్జెట్‌ను సమర్పిస్తారు. వ్యవసాయ బడ్జెట్‌ను బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో, మోపిదేవి వెంకట రమణ మండలిలో ప్రవేశపెడతారు. 

Follow Us:
Download App:
  • android
  • ios