సూపర్ స్టార్ రజినీకాంత్ కి తొలి రోజుల్లో నటించడం వచ్చేది కాదని.. ఎక్కువగా భయపడేవారని నటి సుహాసిని వెల్లడించారు. కె.బాలచందర్ 89వ జయంతి కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సుహాసిని చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ''నేను మొదటిసారి చూసిన సినిమా షూటింగ్ 'మూండ్రు ముడిచ్చు'.. మా ఇంటి వెనకే సినిమా షూటింగ్ జరిగేది.. ఆ సినిమాలో నటించిన రజినీకాంత్ అప్పట్లో పరిశ్రమకు కొత్త. అందువల్ల ఎవరితోనూ మాట్లాడేవారు కాదని'' వెల్లడించారు. 

బాలచందర్ గారంటే రజినీకాంత్ కి చాలా భయమని, షూటింగ్ కి బ్రేక్ ఇచ్చే సమయంలో తన ఇంటి తలుపు పక్కన నిల్చొని పొగ తాగేవారని  గుర్తుచేసుకున్నారు. అప్పట్లో రజినికి కెమెరా లుక్ పెట్టడం చాలా కష్టమైన పని అని.. బాలచందర్ గారే ఆయనకి నటన నేర్పించారని అన్నారు.

రజినీకాంత్ తో పాటు చాలా మందికి బాలచందర్ గారే నటన నేర్పించారని తెలిపారు. బాలచందర్ గారు చెప్పినందుకే తను మణిరత్నంను పెళ్లి చేసుకున్నానని వెల్లడించారు సుహాసిని.