అమలాపాల్ మాజీ భర్త, దర్శకుడు ఏఎల్. విజయ్ మొత్తానికి మరో పెళ్లి చేసుకున్నాడు. గత కొంత కాలంగా ఇంటర్నెట్ లో విజయ్ పెళ్లికి సంబందించిన రూమర్స్ ఎన్నో వచ్చాయి. అయితే వాటిపై దర్శకుడు పెద్దగా స్పందించలేదు. ముఖ్యంగా హీరోయిన్ సాయి పల్లవిని సీక్రెట్ గా పెళ్లిచేసుకోబోతున్నట్లు రూమర్స్ వచ్చాయి. 

అయితే ఫైనల్ గా ఆ రూమర్స్ కి దర్శకుడు పెళ్లితో ఎండ్ కార్డ్ వేశాడు. గురువారం ఎలాంటి హడావుడి లేకుండా కుటుంబ సభ్యుల సమక్షంలో విజయ్ చెన్నైకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు ఐశ్వర్య.  డాక్టర్ అని తెలుస్తోంది. ప్రస్తుతం వీరికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

2014లో అమలాపాల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విజయ్  2017లో పరస్పర అంగీకారంతో  చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నారు. విజయ్ డైరెక్ట్ చేసిన నాన్న సినిమాలో తొలిసారి నటించిన అమలాపాల్ అప్పుడే విజయ్ ప్రేమలో పడింది. గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న రెండేళ్లకే కెరీర్ దృష్ట్యా ఇద్దరికి వ్యక్తిగత అభిప్రాయ బేధాలు రావడంతో విడిపోయినట్లు సమాచారం.