న్యూజిలాండ్ తో జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ లో టీమిండియా ఓడిపోవడం భారత క్రికెట్ అభిమానులను ఎంతగానో బాధించింది. గెలుస్తుందనుకున్న మ్యాచ్ కాస్త ఓడిపోవడంతో ఓటమిని తట్టుకోలేకపొతున్నారు. సామాన్యుల దగ్గర నుండి సెలబ్రిటీల వరకు అందరూ బాధపడుతున్నారు.

ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే సెమీస్ గురించి ఒక ట్వీట్ చేసింది. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని ప్రశంసించింది.

''భారత ఓటమి హృదయాన్ని ముక్కలు చేసింది. కానీ.. ధోనీ నువ్వు నిజమైన ఆటగాడివి.. నువ్వు నా ఫేవరేట్ ఆటగాడివి ఎందుకయ్యావో మరోసారి నిరూపించావు. భారత్ ను గెలిపించడం కోసం అతను చేయాల్సిందంతా చేశాడు. గెలుపు కోసం చివరి వరకు ప్రయత్నించాడు. మాజీ నాయకుడికి గౌరవం.. ప్రేమతో'' అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది.

ఇది చూసిన నెటిజన్లు పూజాని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. లక్ష్యానికి దగ్గరగా వెళ్లిన మ్యాచ్ ధోనీ వలనే చేజారిపోయిందని విమర్శిస్తున్నారు. మ్యాచ్ ఓడిపోవడానికి కారణం ధోనీనే అని.. చాలా బాల్స్ వృధా చేశాడని.. మరీ ఇంత కూల్ అయితే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.

చివరి ఓవర్ వరకు సింగిల్స్ తీసి టీమ్ ఓడిపోవడానికి కారణమయ్యాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. గెలవాల్సిన మ్యాచ్ ను ఓడించిన ధోనీని ప్రశంసిస్తావా..? అంటూ కొందరు పూజాపై విమర్శలు గుప్పిస్తున్నారు.