'ఛలో' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా తాజాగా కొన్ని కామెంట్స్ చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న 'డియర్ కామ్రేడ్' సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఆమె క్రికెటర్ గా కనిపించనుంది.

అయితే ఆ పాత్ర కోసం తనను ఎంతగానో ఇబ్బంది పెట్టారని గుర్తుచేసుకుంది ఈ బ్యూటీ. సినిమాలో ఓ పది నిముషాలు మాత్రమే క్రికెట్ సీన్లు ఉంటాయని వాటి కోసం తనను బాగా ఇబ్బంది పెట్టారని చెప్పింది రష్మిక. పది నిమిషాల విజువల్స్ కోసం తనతో దాదాపు నాలుగు నెలల పాటు క్రికెట్ ప్రాక్టీస్ చేయించారని.. చాలా దెబ్బలు తగిలాయని.. షూటింగ్ లో కూడా ఇరవై రోజుల పాటు తనను ఏడిపించారని వెల్లడించింది. 

కానీ మరీ పది నిమిషాల కోసం ఇలా చేయడం టూమచ్ అని డియర్ కామ్రేడ్' ట్రైలర్ రిలీజ్ అయిన సందర్భంగా వెల్లడించింది రష్మిక. అయితే ఇదంతా కంప్లైంట్ లా చెప్పడం లేదని.. ఇష్టంతోనే చెబుతున్నట్లు వెల్లడించింది. డబ్బింగ్ కోసం కూడా తనను బాగా ఇబ్బంది పెట్టారని దాదాపు మూడు నుండి నాలుగు నెలల పాటు డబ్బింగ్ చెప్పించారని.. దాదాపు ప్రతీరోజు డబ్బింగ్ చెప్పించారని.. రిలీజ్ కి ఇరవై రోజుల ముందు కూడా డబ్బింగ్ చెప్పించారని తెలిపింది.

ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ సినిమా జర్నీని ఎంజాయ్ చేసానని.. షూటింగ్ అయిపోయినందుకు చాలా బాధేసిందని చెప్పుకొచ్చింది. ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.