అమరావతి: టీడీపీ సభ్యులపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం శుక్రవారం నాడు అసహనాన్ని వ్యక్తం చేశారు. అధికార పక్ష సభ్యులు మాట్లాడుతున్న సమయంలో  విపక్షపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గొడవ చేయడంతో  సభలో గందరగోళ వాతావరణం చోటు చేసుకొంది. ఈ సమయంలో  స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం నాడు వడ్డీ రాయితీ లేని అప్పుల విషయమై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది.  ఈ సమయంలో  స్పీకర్  తమ్మినేని సీతారాం జోక్యం చేసుకొన్నారు. ముఖ్యమంత్రి కానీ, విపక్షనేత కానీ మాట్లాడే సమయంలో  ఎవరూ కూడ అడ్డుతగలకూడదని  ఆయన కోరారు. సభలో తాను సీనియర్‌నని సభను హుందాగా నడుపుతన్నట్టుగా చెప్పారు.

సభ నిర్వహణలో ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గడం లేదన్నారు.  హుందాగా సభను నడిపించేందుకు తాను ప్రయత్నిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. సభను హుందాగా నడిపించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తమ్మినేని కోరారు. 

తమకు మాట్లాడే సమయం ఇవ్వాలని టీడీపీ సభ్యులు కోరడంపై ఆయన  ఆయన ఇదేమీ ఫిష్ మార్కెట్ కాదన్నారు. సభ్యుల ప్రవర్తనను ప్రజలు చూస్తున్నారని ఆయన గుర్తు చేశారు.  

 

సంబంధిత వార్తలు

బుద్ది పెరగలేదు: అచ్చెన్నాయుడుపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు

మేం తలుచుకొంటే మీరు అసెంబ్లీలో కూర్చోలేరు: జగన్