మాంచెస్టర్‌ : తమ జట్టు ప్రపంచ కప్ టోర్నీ సెమీ ఫైనల్ మ్యాచులో ఓడిపోవడంపై టీమిండియా వైఎస్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రారంభంలోని తమ చెత్త అట వల్లనే సెమీ ఫైనల్ మ్యాచులో ఓడిపోయామని ఆయన అంగీకరించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 18 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుంచి ఇంటి దారి పట్టిన విషయం తెలిసిందే. 

సెమీ పైనల్లో ఓటమిపై రోహిత్‌ శర్మ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. కీలక సమయంలో జట్టుగా విఫలమయ్యామని, 30 నిమిషాల తమ చెత్త ఆటనే ప్రపంచకప్‌ గెలిచే అవకాశాలను దూరం చేసిందని ఆయన అన్నాడు. ఈ ఫలితంతో తన గుండె భారమైందని, మీకు కూడా అలానే ఉంటుందని ఆయన అన్నాడు. 

దేశం బయట అభిమానుల మద్దతు వెలకట్టలేనిదని, యూకేలో తాము ఎక్కడ ఆడినా అక్కడకు వచ్చి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని రోహిత్‌ శర్మ ట్వీట్‌ చేశాడు.