Asianet News TeluguAsianet News Telugu

డూ ఆర్ డై మ్యాచుల్లో విరాట్ కోహ్లీ పరమ చెత్త బ్యాటింగ్

మొత్తంగా చూస్తే, విరాట్ కోహ్లీ కీలకమైన మ్యాచుల్లో ప్రదర్శించిన ఆట ఆందోళనకరంగా ఉందనే విషయం తెలిసిపోతుంది. సెమీ ఫైనల్ మ్యాచులో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో కోహ్లీ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఆరు బంతులను ఎదుర్కున్న కోహ్లీ ఒక్క పరుగు చేసి చేతులెత్తేశాడు. 

Virat Kohli fails to deliver in a knockout match yet again, averages just 12.16 in 6 do-or-die ties
Author
Mumbai, First Published Jul 12, 2019, 12:56 PM IST

ముంబై: చావో రేవో తేల్చుకోవాల్సిన కీలకమైన మ్యాచుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పరమ చెత్తగా ఉంది. ప్రస్తుత ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచులోనే కాదు, గతంలో జరిగిన కీలకమైన టోర్నీల్లో కూడా నాకౌట్ దశలో కోహ్లీ బ్యాటింగ్ చెత్గగానే ఉంది. 

ప్రస్తుత ప్రపంచ కప్ టోర్నీలో ఇండియా బ్యాటింగ్ మొత్తం రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీల మీదనే ఆధారపడింది. లీగ్ దశలో అద్భుతమైన విజయాలు సాధించిన ఇండియా తప్పకుండా ఫైనల్ చేరుకుని కప్ ను ఎగురేసుకుపోతుందని క్రికెట్ పండితులు మొత్తం భావించారు. కానీ, నాకౌట్ దశలో పూర్తిగా ఆ ముగ్గురు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. 

మొత్తంగా చూస్తే, విరాట్ కోహ్లీ కీలకమైన మ్యాచుల్లో ప్రదర్శించిన ఆట ఆందోళనకరంగా ఉందనే విషయం తెలిసిపోతుంది. సెమీ ఫైనల్ మ్యాచులో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో కోహ్లీ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఆరు బంతులను ఎదుర్కున్న కోహ్లీ ఒక్క పరుగు చేసి చేతులెత్తేశాడు. కోహ్లీ ప్రపంచ కప్ టోర్నీల్లో ఘోరంగా విఫలం కావడం ఇది మూడోసారి. 

ప్రపంచ మేటి బ్యాట్స్ మన్ గా ప్రసిద్ధి గాంచిన కోహ్లీ 2011లో పాకిస్తాన్ పై జరిగిన మ్యాచులో కేవలం 9 పరుగులు చేశాడు. ఆ తర్వాత 2015, 2019ల్లో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచుల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లపై ఒక్కటేసి పరుగు మాత్రమే చేశాడు. 

2011లో అహ్మదాబాదులో ఆస్ట్రేలియాపై జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచులో కోహ్లీ 33 బంతులను ఎదుర్కుని కేవలం 24 పరుగులు చేశాడు. ఇండియా ట్రోఫీని గెలుచుకున్నప్పటికీ శ్రీలంకపై జరిగిన ఫైనల్ మ్యాచులో కోహ్లీ 49 బంతుల్లో 35 పరుగులు మాత్రమే చేశాడు. 

ఐసిసి ప్రపంచ కప్ 2015లో బంగ్లాదేశ్ పై జరిగిన క్వార్టర్ ఫైనల్ (నాకౌట్) మ్యాచులో 8 బంతులు ఆడి 3 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు కోహ్లీ ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచులు ఆరు ఆడాడు. ఈ ఆరు మ్యాచుల్లో అతను చేసిన స్కోరు 73 పరుగులు మాత్రమే. ఈ మ్యాచుల్లో బ్యాటింగ్ సగటు 12.16 మాత్రమే. స్ట్రయిక్ రేట్ కూడా 56.15 మాత్రమే ఉంది. 

చాంపియన్స్ ట్రోఫీ కీలక మ్యాచుల్లో మాత్రం కోహ్లీ ప్రదర్శన కాస్తా మెరుగ్గా ఉంది. 2017లో పాకిస్తాన్ పై జరిగిన ఫైనల్ మ్యాచును వదిలేస్తే బంగ్లాదేశ్ పై జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో కేవలం ఐదు పరుగులు చేశాడు. ఫైనల్ మ్యాచులో మాత్రం 78 బంతులను ఎదుర్కుని 96 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 2013 చాంపియన్స్ ట్రోఫీ శ్రీలంకపై జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులోనూ, ఇంగ్లాండుపై జరిగిన ఫైనల్ మ్యాచులోనూ బాగా ఆడాడు. అతను 43 బంతుల్లో 58 పరుగులు ేచశాడు. 

కోహ్లీ ప్రదర్శన పొట్టి క్రికెట్ ట్వంటీ20ల్లోని నాకౌట్ మ్యాచుల్లో మాత్రం చాలా మెరుగ్గా ఉంది. 2016 ట్వంటీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచులో కేవలం 47 బంతుల్లో 89 పరుగులు చేశాడు. 2014 ఎడిషన్  సెమీ ఫైనల్ మ్యాచులో దక్షిణాఫ్రికాపై 72 పరుగులు, ఫైనల్ మ్యాచులో శ్రీలంకపై 77 పరుగులు చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios