అమరావతి: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యడ్లపాటి రఘునాథబాబుకు బీజేపీ కీలక పదవి కట్టబెట్టింది. పొగాకు బోర్డు చైర్మన్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  రఘునాథబాబును చైర్మన్ గా నియమిస్తూ కేంద్రపరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి మహేందర్ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. 

రఘునాథబాబు ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. గత కొంతకాలంగా పొగాకు బోర్డుకు చైర్మన్ లేరు. ఈ నేపథ్యంలో పొగాకు బోర్డు చైర్మన్ గా ఇన్ చార్జి చైర్మన్ కే సునీత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా రఘునాథబాబును చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రప్రభుత్వం. రెండు రోజుల్లో రఘునాథబాబు బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది.