అమరావతి: మధ్య తరగతి ప్రజలకు కూడ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింపజేయనున్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. వైద్య ఖర్చుల కోసం ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అండగా నిలవనున్నట్టుగా ఏపీ సర్కార్ స్పష్టం చేసింది.

శుక్రవారం నాడు ఏపీ బడ్జెట్‌ను  ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో  నెలకు రూ.40వేలు ఆదాయం ఉన్న వారికి కూడ ఈ పథకం వర్తింపజేస్తామన్నారు. ఏడాదికి రూ. 5లక్షల వార్షికాదాయం ఉన్న వారికి ఈ పథకం అందిస్తామన్నారు.

ఆరోగ్య శ్రీ పథకానికి ఈ బడ్జెట్‌లో రూ.1740 కోట్లు కేటాయించింది. వెయ్యి రూపాయాలకు పైగా అయ్యే ఖర్చును ఈ పథకం కింద ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి మండల కేంద్రంలో 108 అంబులెన్స్‌ ఉండేలా చర్యలు తీసుకొంటున్నట్టుగా మంత్రి ప్రకటించారు. రోగులు ఫోన్ చేసిన 20 నిమిషాలలోపుగానే అంబులెన్స్‌లు చేరుకొనేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన విషయాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  ప్రకటించారు.  ఆరోగ్యశ్రీలో మార్పుల వల్ల రాష్ట్రంలోని మరో ఐదు లక్షల మందికి కూడ లబ్ది చేకూరుతోందని  మంత్రి చెప్పారు. 

సంబంధిత వార్తలు

బుగ్గన బడ్జెట్‌: రైతాంగానికి పెద్దపీట

ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తాం: బుగ్గన