సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన ఆయన శుక్రవారం సభలో జగన్ వ్యవహారశైలిపై మండిపడ్డారు.

సీఎంకి సభా నియమావళిపై అవగాహన లేదని ఆయన ప్రతిఒక్క దానికి సలహాదారులను నియమించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సున్నా వడ్డీలపై అధికార పక్షం సభను తప్పుదోవ పట్టించారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

అసలు విషయం చెప్పమంటే ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా ఆవుకథ చెప్పారని ఆయన సెటైర్లు వేశారు. అచ్చెన్నాయుడు బాగా పెరిగాడుగానీ.. బుద్ధి పెరగలేదని నా మీద సెటైర్లు వేస్తున్నాడని.. అయితే జగన్ ‌కూడా ముఖ్యమంత్రి అయ్యారు కానీ.. ఆయనకు కూడా బుద్ధి పెరగలేదని కౌంటరిచ్చారు.