Asianet News TeluguAsianet News Telugu

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రైట్స్: గద్దలా తన్నుకుపోతాడని వాళ్ల భయం

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఆదివారం హైదరాబాద్‌లో వైభవంగా మొదలైన ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి. నేషనల్ మీడియా సైతం ఈ సినిమా గురించి బాగానే మాట్లాడింది.  

karan johar showing keen interest on rajamouli's RRR ?
Author
Hyderabad, First Published Nov 15, 2018, 9:24 AM IST

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఆదివారం హైదరాబాద్‌లో వైభవంగా మొదలైన ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి. నేషనల్ మీడియా సైతం ఈ సినిమా గురించి బాగానే మాట్లాడింది.  

ఈ నేపధ్యంలో హిందీ డబ్బింగ్  కు సంభందించిన బిజినెస్ ఆఫర్స్ మొదలయ్యాయని సమాచారం. ఇప్పటికే కొందరు బాలీవుడ్ పెద్దలు ..నిర్మాత దానయ్యని ఈ విషయమై కాంటాక్ట్ అవుతున్నారు.  అయితే అందరి దృష్టీ కరుణ్ జోహార్ పై ఉంది. హఠాత్తుగా సీన్ లోకి వచ్చి గద్దలా తన్నుకుపోతాడేమో అనుకుంటున్నారు. 

ఎందుకంటే తను పైసా పెట్టుబ‌డి లేకుండా 'బాహుబ‌లి' రెండు భాగాల్ని హిందీలో రిలీజ్ చేయ‌డంతో భారీగా డబ్బులు మూట‌గ‌ట్టుకున్నారు  క‌ర‌ణ్ జోహార్. ఖచ్చితంగా ఆయన దృష్టి కూడా ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ చిత్రంపైనా ఉంటుంది. దర్శక,నిర్మాతలు సైతం కరణ్ జోహార్ తో ముందుకు వెళ్లటానికి ఆసక్తి చూపుతారు. ఎందుకంటే పబ్లిసిటీ, భారీగా రిలీజ్ విషయంలో కరుణ్ జోహార్ తనదైన శైలిలో ముందుకు వెళ్లి సక్సెస్ చేయగలరు. 

దాంతో హిందీలో ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లోనే విడుదల చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ,ప్రపోజల్ ఇప్పటికే ఉంటుందని అంటున్నారు. అయితే కరణ్ జోహర్ కన్నా..ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఈ సినిమా రైట్స్ సొంతం చేసుకోవాలని మిగతా పెద్ద నిర్మాణ సంస్దలు ఆలోచిస్తున్నాయట.. ఇప్పటికే  వాళ్లు రాజమౌళిని, నిర్మాత డివీవీ దానయ్యను సంప్రదించినట్టు సమాచారం. 

ఇక కరణ్ జోహార్... రజనీ కాంత్‌ ‘రోబో 2ఓ’ ను హిందీలో తన బ్యానర్‌లోనే విడుదల చేయాలని భావించినా లాస్ట్ మినిట్ లో కుదరక ప్రాజెక్ట్‌ను వదులుకున్నాడు. అయితే ఈ సారి అలాంటిది జరగకుండా.. రాజమౌళి తదపరి చిత్రం ఖచ్చితంగా తీసుకోవాలని  కరణ్‌ జోహార్‌ భావిస్తున్నట్టు బాలీవుడ్ మీడీయా అంటోంది. మరి చివరకు ఎటు వైపు ఈ సినిమా వెళ్తుందో చూడాలి. 

ఇవి కూడా చదవండి..

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

RRRలకు రెమ్యూనరేషన్ లేదు..నిర్మాత హ్యాపీ!

RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?

#RRR: తారక్ చరణ్.. దొంగా - పోలీస్!

మల్టీస్టారర్ గురించి షాకిచ్చిన చరణ్

షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?

రాజమౌళి ఛాన్స్ ఇచ్చాడా?

#RRR సినిమాకి రైటర్ విజయేంద్రప్రసాద్ కాదట

రాజమౌళి మూవీలో విలన్ గా రాజశేఖర్..

ఇక నుంచి జూనియర్ కాదు

Follow Us:
Download App:
  • android
  • ios