గత కొద్దిరోజులుగా రాజమౌళి తెరకెక్కించబోయే మల్టీస్టారర్ సినిమాలో హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు సినిమా కోసం ఎంత రెమ్యునరేషన్  తీసుకోబోతున్నారనే విషయంపై చర్చలు సాగుతున్నాయి.

దాదాపు రూ.300 కోట్లు(అంచనా మాత్రమే) బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించాలని  భావిస్తున్నారట. అయితే ఈ సినిమాకు పని చేసే చీఫ్ టెక్నీషియన్స్ కి, నటీనటులకు.. రాజమౌళితో సహా ఎవరికీ రెమ్యునరేషన్ ఇవ్వకుండా లాభాల్లో వాటా తీసుకునేలా ప్లాన్ చేశాడు నిర్మాత డివివి దానయ్య.

ఈ లెక్కన హీరోలకి ఎంత వస్తుందనే విషయంపై రూ.30 కోట్లు అని అంటున్నారు. సినిమా బిజినెస్ ని బట్టి చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్ల రెమ్యునరేషన్ అందే అవకాశాలు ఉన్నాయి. రాజమౌళికి ఎలా లేదన్నా.. 50-60 కోట్లు ఆయన పాకెట్ లోకి చేరతాయని తెలుస్తోంది.

సినిమా హక్కులు గనుక ఊహించినదానికంటే ఎక్కువ మొత్తాలకి అమ్ముడైతే అప్పుడు పారితోషికం మరింత పెరిగే అవకాశం ఉంది. నవంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

ప్రస్తుతం చరణ్, బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నాడు. వీలైనంత తొందరగా ఆ సినిమాని పూర్తి చేసే పనిలో పడ్డాడు. మరోపక్క ఎన్టీఆర్ 'అరవింద సమేత' సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. 

ఇది కూడా చదవండి.. 

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

RRRలకు రెమ్యూనరేషన్ లేదు..నిర్మాత హ్యాపీ!

RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?

#RRR: తారక్ చరణ్.. దొంగా - పోలీస్!

మల్టీస్టారర్ గురించి షాకిచ్చిన చరణ్

షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?

రాజమౌళి ఛాన్స్ ఇచ్చాడా?

#RRR సినిమాకి రైటర్ విజయేంద్రప్రసాద్ కాదట

రాజమౌళి మూవీలో విలన్ గా రాజశేఖర్..

ఇక నుంచి జూనియర్ కాదు