రాజమౌళి విజయేంద్రప్రసాద్ కాంబినేషన్ వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్. వాళ్ల కాంబినేషన్ కు ఉండే క్రేజ్ వేరు. అలాంటిది రాజమౌళి ఎన్టీఆర్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి కథ విజయేంద్ర ప్రసాద్ ఇవ్వలేదట.ఎన్.టీ.ఆర్ తో తీసిన మొదటి సినిమా ‘స్టూడెంట్ నెం.1’ మినహా ఇస్తే... ఆ తర్వాత జక్కన్న తీసిన సినిమాలన్నింటికీ విజయేంద్ర ప్రసాదే కథ అందించాడు.  

రామారావు-రామ్ చరణ్- రాజమౌళి కాంబినేషన్లో సినిమా అనగానే కథ ఏ రేంజ్ లో ఉంటుందోనని ఊహగానాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ఈ సారి విజయేంద్ర ప్రసాద్ ఎటువంటి కథను అందించబోతున్నాడో అని అభిమానులు ఆగమేఘాల్లో ఉన్నారు. నిన్న మొన్నటిదాకా విజయేంద్ర ప్రసాదే కథ రాస్తున్నాడని అనుకున్నారంతా. అయితే ఇప్పుడు వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ కథను కాకుండా తన స్నేహితుడూ- ఫ్యామిలీ మిత్రుడు అయిన గుఱ్ణం గంగరాజు కథతో సినిమా తెరకెక్కించాలని అనుకుంటున్నాడట జక్కన్న. ఇప్పటికే గుఱ్ఱం గంగరాజు తండ్రీకొడుకులకు కథ చెప్పాడని- ఆ కథకి మెరుగులు దిద్దే పనుల్లో జక్కన్న కుటుంబం పడిందని సమాచారం.

1980 ఒలింపిక్స్ బ్యాక్ డ్రాపులో ఈ సినిమా స్పోర్ట్స్ ప్రధానంగా ఉంటుందని సమాచారం. ఇందులో ఎన్.టీ.ఆర్ బాక్సర్ గా కనిపిస్తే... చరణ్ హార్స్ రైడర్ గా కనిపించబోతున్నాడని సమాచారం. గుఱ్ఱం గంగరాజు ఇంతవరకూ ‘అమృతం’ సిరీయల్ కు మాత్రమే కథ అందించాడు. ఇప్పుడు ఈ భారీ మల్టీస్టారర్కి కథ అందించబోతున్నాడని తెలుస్తోంది.