- Home
- Entertainment
- Nithiin: అలియాస్ రుక్మిణి ట్రైలర్ రివ్యూ..అలాంటి నవలలు రాసే రచయిత జీవితంలో ట్విస్ట్ లు, నితిన్ ఫస్ట్ టైం ఇలా
Nithiin: అలియాస్ రుక్మిణి ట్రైలర్ రివ్యూ..అలాంటి నవలలు రాసే రచయిత జీవితంలో ట్విస్ట్ లు, నితిన్ ఫస్ట్ టైం ఇలా
నితిన్ నటించిన అలియాస్ రుక్మిణీ ట్రైలర్ విడుదలైంది. నాని సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 4న రిలీజ్ అవుతోంది. ట్రైలర్ ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం.

అలియాస్ రుక్మిణీ ట్రైలర్ రివ్యూ
వరుస ఫ్లాపుల తర్వాత నితిన్ రూటు మార్చారు. తమ్ముడు, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్ ఇలా నితిన్ నటించిన మాస్ సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. దీనితో నితిన్ మాస్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి వైవిధ్యమైన కథ ఎంచుకున్నారు. సాధారణంగా నితిన్ మాస్ సినిమాలు వర్కౌట్ కాకపోతే రొమాంటిక్ లవ్ స్టోరీలతో బౌన్స్ బ్యాక్ అయ్యేవాడు. దానికి భిన్నంగా ఈసారి అలియాస్ రుక్మిణి అంటూ వైవిధ్యమైన క్లాస్ కథని ఎంచుకున్నారు. ఈ చిత్రం నేచురల్ స్టార్ నాని సమర్పణలో తెరకెక్కింది.
ఫ్యామిలీ కోర్టులో పనిచేసే ఉద్యోగి జీవితం
మురళికాంత్ దేవసోత్ ఈ చిత్రానికి దర్శకుడు. డిసెంబర్ 4న ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ చేశారు. నితిన్ కి జోడిగా ఈ మూవీలో బాలీవుడ్ నటి ఆఫియా సయ్యద్ నటిస్తోంది. ట్రైలర్ ఆశించినట్లుగానే క్లాస్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసేలా ఉంది. ట్రైలర్ లో వీలైనంత వరకు కథ గురించి చెప్పేశారు. కృష్ణ(నితిన్) అనే వ్యక్తి ఫ్యామిలీ కోర్టులో పనిచేసే ఉద్యోగి. ఇది అతడి గురించి అందరికీ తెలిసిన విషయం.
అతడి సీక్రెట్ లైఫ్ ఇదే
కానీ అతడికి సీక్రెట్ లైఫ్ కూడా ఉంటుంది. రుక్మిణీ అనే పేరుతో సీక్రెట్ గా రొమాంటిక్ నవలలు రాస్తుంటాడు. అప్పటికే హీరో పెళ్లి ప్రయత్నాల్లో ఉంటాడు. హీరోయిన్ తో పెళ్లి సంబంధం వస్తుంది. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తిరిగింది.. అసలు కృష్ణ రుక్మిణి పేరుతో ఆ నవలలు ఎందుకు రాస్తున్నాడు.. ఈ విషయం హీరోయిన్ కి ఎలా తెలిసింది లాంటి అంశాలని సర్ప్రైజింగ్ ప్యాకేజ్ లా దాచి ఉంచారు.
డిసెంబర్ 4న రిలీజ్
నితిన్ తన కెరీర్ లో తొలిసారి కంప్లీట్ ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నారు. విజయ్ బుల్గానిన్ అందించిన బిజియం ట్రైలర్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకువెళ్ళింది. ట్రైలర్ మాత్రం సినిమాపై పర్ఫెక్ట్ గా అంచనాలు సెట్ చేసేలా ఉంది. మరి ఈ సినిమా నితిన్ వరుస ఫ్లాపులకు బ్రేకులు వేస్తుందా లేదా అనేది తెలియాలంటే డిసెంబర్ 4న వరకు ఎదురుచూడాలి.















