రాజమౌళి ఛాన్స్ ఇచ్చాడా?

రాజమౌళి ఛాన్స్ ఇచ్చాడా?

'బాహుబలి' సినిమా తరువాత దర్శకుడు రాజమౌళి.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా మల్టీస్టారర్ సినిమా రూపొందించనున్న సంగతి తెలిసిందే. డివివి దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాను #RRR అనే పేరుతో పిలుచుకుంటున్నారు. అంతకుమించి ఈ సినిమాకు సంబంధించి ఒక్క విషయాన్ని కూడా రాజమౌళి వెల్లడించలేదు. నిజానికి ఈ సినిమాలో హీరోలుగా నటిస్తోన్న చరణ్, ఎన్టీఆర్ లకు కూడా ఈ సినిమా స్టోరీ ఏంటనేది తెలియదట.

రాజమౌళితో సినిమా అనగానే అంగీకరించేశామని వారు బహిరంగంగానే స్పష్టం చేశారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్లుగా రకుల్, కాజల్, రాశిఖన్నా ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు హీరోయిన్ గా ఎవరిని ఫైనల్ చేయలేదని చిత్రబృందం వెల్లడించింది. తాజాగా కీర్తి సురేష్ ను ఒక హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారని టాక్. 

'మహానటి' సినిమాలో ఆమె నటన చూసి ముగ్ధుడైన రాజమౌళి తన సినిమాలో ఒక హీరోయిన్ గా కీర్తిని తీసుకోబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో కొద్దిరోజుల్లో తెలియనుంది!

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos