టాలీవుడ్ లో ఎన్ని సినిమాలు వచ్చినా అందరి చూపు ఎక్కువగా ఒకే ఒక్క సినిమాపై ఉంటుంది. అదే రాజమౌళి #RRR. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో కథానాయకులుగా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. విజయేంద్రప్రసాద్ ఇద్దరు హీరోలను దృష్టిలో ఉంచుకొని మరి కథను రాశారట. ఇక రాజమౌళి తనదైన శైలిలో తెరకెక్కించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. 

గత కొంత కాలంగా ఈ ప్రాజెక్ట్ పై ఎన్నో రకాల రూమర్స్ వస్తున్నాయి. ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా చిత్ర యూనిట్ పట్టించుకోవడం లేదు. సినిమా సెట్స్ మీదకు వెళ్లెవరకూ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యారు. అయితే సన్నిహితులకు నుంచి వస్తోన్న టాక్ ప్రకారం సినిమా కథ గురించి ఒక విషయం తెలిసింది. 

సినిమా కథ ఒక దొంగ పోలీస్ తరహాలో కొనసాగుతుందని సమాచారం. రామ్ చరణ్ ఒక ఆగ్రహంతో ఉండే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడట. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఒక దొంగగా కనిపిస్తాడట. ఇద్దరి మధ్య జరిగే సన్నివేశాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయని సమాచారం. 

నవంబర్ లో ప్రాజెక్టుకు సంబందించిన కొన్ని వర్క్ షాప్ లను నిర్వహించనున్నారు. అప్పుడు హీరోలిద్దరికి దొంగా - పోలీస్ కి సంబందించిన సన్నివేశాలు, పాత్రల గురించి జక్కన్న క్లియర్ గా వివరిస్తాడట. అనంతరం సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి 2020నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు.