దర్శకధీరుడు రాజమౌళి.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో మల్టీస్టారర్ సినిమా చేయనున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు.  ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి మరో పది రోజుల సమయం మాత్రమే ఉంది. వచ్చే నెల 5న పూజా కార్యక్రమాలు నిర్వహించి రెగ్యులర్ షూటింగ్  మొదలుపెడతారని తెలుస్తోంది.

రీసెంట్ గా ఎన్టీఆర్ జిమ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ తో కలిసి రాజమౌళి.. ఎన్టీఆర్ లుక్స్ ఎలా ఉండాలనే విషయంపై చర్చించారు. ఎన్టీఆర్ లుక్ విషయంలో రాజమౌళి ఓ నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు రామ్ చరణ్ లుక్ ఎలా ఉండాలని డిసైడ్ చేయబోతున్నారు.

సోమవారం నాడు రామ్ చరణ్ పై స్పెషల్ ఫోటో షూట్ ని నిర్వహించారు. ఈ వారం మొత్తం ఇది ఉంటుందని తెలుస్తోంది. వారం లోపు చరణ్ లుక్ ని డిసైడ్ చేసి, వచ్చే వారంలో సినిమాని మొదలుపెడతారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఇప్పటికే హైదరాబాద్ లో అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకమైన సెట్స్ ని ఏర్పాటు చేశారు.

సెట్ వర్క్ పూర్తి కావడంతో ఇప్పుడు సినిమాకి సంబంధించిన షూటింగ్ ని మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని టాక్. కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు. 

ఇది కూడా చదవండి.. 

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

RRRలకు రెమ్యూనరేషన్ లేదు..నిర్మాత హ్యాపీ!

RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?

#RRR: తారక్ చరణ్.. దొంగా - పోలీస్!

మల్టీస్టారర్ గురించి షాకిచ్చిన చరణ్

షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?

రాజమౌళి ఛాన్స్ ఇచ్చాడా?

#RRR సినిమాకి రైటర్ విజయేంద్రప్రసాద్ కాదట

రాజమౌళి మూవీలో విలన్ గా రాజశేఖర్..

ఇక నుంచి జూనియర్ కాదు