రాజమౌళి దర్శకత్వంలో తారక్, చరణ్ కాంబినేషన్ లో వస్తున్న మల్టీస్టారర్ గురించి అందరికి తెలిసిందే. టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతోన్న జూనియర్ ఎన్టీఆర్   - మెగా పవర్ స్టార్ లు ఒకే తెరపై చూడాలని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. 

దీంతో సినిమాకు సంబందించిన ఎలాంటి న్యూస్ అయినా బయటకు వచ్చిన అభిమానులు వెంటనే తెలుసుకుంటున్నారు. ఆ తరువాత సోషల్ మీడియాలో చర్చలు కూడా మొదలవుతున్నాయి. ప్రస్తుతం కూడా మరో వార్త హాట్ టాపిక్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ న్యూస్ వింటే ఎవ్వరైనా సరే చర్చించకుండా ఉండలేరు. ఎందుకంటే తారక్ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయింది. చాలా వరకు తారక్ క్యారెక్టర్ లో నెగిటివ్ షేడ్స్ కనిపిస్తాయట. 

ఇంతకుముందు జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ రావణా అంటూ జై పాత్రలో భయంకరంగా కనిపించిన సంగతి తెలిసిందే. కానీ అది ఓ సైడ్ నుంచి ఆలోచిస్తే పాజిటివ్ అండ్ స్టైలిష్ క్యారెక్టర్. మాస్ ఆడియెన్స్ కి బాగా నచ్చేసింది. ఇక రాజమౌళి కూడా #RRR లో తారక్ క్యారెక్టర్ ను అలా నెగిటివ్ షేడ్స్ ఉండేలా డిజైన్ చేసుకుంటున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు తుది దశలో ఉన్నాయి.  ఫుల్ స్క్రిప్ట్ పూర్తవ్వగానే చిత్ర యూనిట్ మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలను తెలియజేయనుంది.