మల్టీస్టారర్ కథ అంటే ఇలా ఉండల్రా.. అనే డైలాగ్ ప్రతి ఆడియెన్ కి గుర్తొచ్చేలా రాజమౌళి కష్టపడుతున్న తీరు అంతా ఇంతా కాదు. మల్టీస్టారర్ కథలంటే ఇద్దరి స్టార్ హీరోలను సమానంగా చూపించాలి. ఎవరిని తక్కువగా చూపించినా అభిమానులను ఆపడం ఎవరితరం కాదు. అందుకే జక్కన్న ప్రయోగాల కంటే జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటున్నాడు. 

ఆ సంగతి అటుంచితే.. ఈ సినిమా బడ్జెట్ మొదట అనుకున్నదానికంటే ఇప్పుడు ఎక్కువగా పెరిగింది. దర్శకుడు వేసుకున్న ప్లాన్ ప్రకారం 200కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లు మొదటి నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మెయిన్ గా రాజమౌళి ఇద్దరి స్టార్ హీరోలకే రెమ్యునరేషన్ ఊహించని విధంగా ఉంటుంది.

అయితే ఈ ముగ్గురు ఇటీవల నిర్మాత దానయ్యతో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అసలైతే ముందుగానే ఈ విషయంపై చర్చలు జరుపుతున్నారు. కానీ ఇప్పుడు మొత్తంగా అదే ప్లాన్ కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారట. ముందుగా రెమ్యునరేషన్ తీసుకోకుండా రిలీజ్ తరువాత వచ్చిన లాభాల్లో షేర్స్ తీసుకోవడం బెటర్ అని ఒక ఒప్పందానికి వచ్చారట. 

ఈ పద్దతిలో వెళితే నిర్మాత ధైర్యంతో హ్యాపీగా ఉండవచ్చు. ఇక సినిమా తప్పకుండా హిట్టవుతుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. లాభాలు వచ్చే అవకాశమే ఎక్కువ. అందుకే తారక్ చరణ్ రాజమౌళి ఇప్పుడందుకుంటున్న రెమ్యునరేషన్ కంటే డబుల్ ప్రాఫిట్ ను పొందే ఛాన్స్ ఉంది. సినిమా మంచి బిజినెస్ చేస్తే ఒక్కొక్కరికి 50కోట్ల షేర్స్ అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది