యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో దర్శకుడు రాజమౌళి మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ ఎలాంటి పాత్రల్లో కనిపించబోతున్నారు..?వారి పాత్రల తీరు తెన్నులపై అభిమానుల ఆసక్తి పెరిగిపోయింది.

ఈ విషయాల గురించి కొన్ని వార్తలు బయటకొచ్చాయి. తాజాగా మరోవార్త హల్చల్ చేస్తోంది. ఇంతకీ ట్విస్ట్ ఏంటంటే..? ఈ సినిమాలో ఎన్టీఆర్ ని విలన్ గా చూపించబోతున్నారని సమాచారం.

రామ్ చరణ్ ని హీరోగా పోట్రేట్ చేయనున్నారు. ఎన్టీఆర్-చరణ్ ల మధ్య పోరు సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెబుతున్నారు. సినిమా మొత్తం వీరిద్దరి మీదే నడుస్తుందట. పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్, అతడిని మట్టుబెట్టాలని చూసే హీరో.. ఇదే రాజమౌళి ఆలోచన అని సమాచారం. రాజమౌళి తన సినిమాలలో హీరోల కంటే విలన్ ని బలంగా చూపిస్తారనే విషయం తెలిసిందే.

ఇప్పటికే ఎన్టీఆర్ 'జై లవకుశ' సినిమాలో విలన్ పాత్ర పోషించాడు. అయితే అందులో హీరో కూడా ఎన్టీఆరే కావడంతో అభిమానులు సినిమాని బాగా ఎంజాయ్ చేశారు. అయితే ఇప్పుడు చరణ్ కి విలన్ గా ఎన్టీఆర్ ని చూపించాలనే ఆలోచనని అభిమానులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనే విషయం ఆలోచించాల్సిందే.. నవంబర్ 18 నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుంది!

ఇది కూడా చదవండి.. 

RRRలకు రెమ్యూనరేషన్ లేదు..నిర్మాత హ్యాపీ!

ఇవి కూడా చదవండి 

RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?

#RRR: తారక్ చరణ్.. దొంగా - పోలీస్!

మల్టీస్టారర్ గురించి షాకిచ్చిన చరణ్

షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?

రాజమౌళి ఛాన్స్ ఇచ్చాడా?

#RRR సినిమాకి రైటర్ విజయేంద్రప్రసాద్ కాదట

రాజమౌళి మూవీలో విలన్ గా రాజశేఖర్..

ఇక నుంచి జూనియర్ కాదు