రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో రాజమౌళి మల్టీస్టారర్ చేయబోతున్నాడని తెలిసినప్పటి నుండి ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. ఈ సినిమా ఇప్పటివరకు మొదలుకాకపోయినా కథ ఎలా ఉండబోతుంది..? ఎన్టీఆర్, చరణ్ ల పాత్రలు ఎలా ఉండబోతున్నాయనే విషయాలపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి.

తాజాగా ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందనే విషయంపై కాస్త క్లారిటీ వచ్చింది. బాలీవుడ్ లో సక్సెస్ అందుకున్న 'ధూమ్' సినిమా మాదిరి ఈ సినిమా కూడా ఉంటుందని చెబుతున్నారు. బాలీవుడ్ లో 'ధూమ్' సిరీస్ నిర్మాతలకు కొన్ని కోట్ల రూపాయల లాభాలు తీసుకొచ్చాయి.

ఇందులో దొంగ.. ఎక్కడ, ఎప్పుడు దొంగతనం చేయబోతున్నాడో చెప్పి మరీ చేస్తాడు. అయినా.. అతడిని పట్టుకోవడం పోలీసులకి పెద్ద టాస్క్ అవుతుంది. అలానే రాజమౌళి మల్టీస్టారర్ కూడా ఉంటుందని అంటున్నారు. ఎన్టీఆర్ విలన్ తరహా పాత్రలో కనిపిస్తే అతడిని పట్టుకోవాలని ప్రయత్నించే పోలీస్ పాత్రలో చరణ్ కనిపించనున్నాడు. 

రాజమౌళి తనదైన స్టైల్ లో ఈ సినిమాని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ 18న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుంది. తన పాత్రకి తగ్గట్లుగా  ఎన్టీఆర్ తన శరీరాకృతిని మార్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. బాహుబలి సినిమాకి పని చేసిన టెక్నికల్ టీమ్ ఈ సినిమాకి కూడా పని చేయబోతుంది! 

ఇది కూడా చదవండి.. 

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

RRRలకు రెమ్యూనరేషన్ లేదు..నిర్మాత హ్యాపీ!

RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?

#RRR: తారక్ చరణ్.. దొంగా - పోలీస్!

మల్టీస్టారర్ గురించి షాకిచ్చిన చరణ్

షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?

రాజమౌళి ఛాన్స్ ఇచ్చాడా?

#RRR సినిమాకి రైటర్ విజయేంద్రప్రసాద్ కాదట

రాజమౌళి మూవీలో విలన్ గా రాజశేఖర్..

ఇక నుంచి జూనియర్ కాదు