Asianet News TeluguAsianet News Telugu

ఇక నుంచి జూనియర్ కాదు

  • న్యూమరాలజీ సెంటిమెంట్ పెరిగిన తర్వాత.. సినిమా తారలు తమ పేర్లలో ఎక్స్ ట్రా అక్షరాలను తగిలించుకోవడం
  • కానీ ఏ హీరో కూడా ఇప్పటివరకూ తన గుర్తింపు తెచ్చిపెట్టిన పేరు కాకుండా.. మరో ఐడెంటిటీని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయలేదు.
  • RRR విషయంలో ఎన్టీఆర్ పేరును రామారావు అని రాయడం చాలానే చర్చలకు దారి తీస్తోంది.
NTR Accepted for His Name Change as Rama Rao For RRR

న్యూమరాలజీ సెంటిమెంట్ పెరిగిన తర్వాత.. సినిమా తారలు తమ పేర్లలో ఎక్స్ ట్రా అక్షరాలను తగిలించుకోవడం.. ఉన్నవాటికి కోత పెడుతుండడం వంటివి చూస్తున్నాం. కానీ ఏ హీరో కూడా ఇప్పటివరకూ తన గుర్తింపు తెచ్చిపెట్టిన పేరు కాకుండా.. మరో ఐడెంటిటీని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయలేదు. #RRR విషయంలో ఎన్టీఆర్ పేరును రామారావు అని రాయడం చాలానే చర్చలకు దారి తీస్తోంది.

పూర్తి పేరు నందమూరి తారక రామారావు అయినా.. జూనియర్ ఎన్టీఆర్ గానే ఇప్పటివరకూ పిలవడం అందరికీ అలవాటు. తారక్ అనే పేరుతో పాటు నందమూరి హీరో అనే ట్యాగ్ లైన్ ఉంది. ఇన్ని గుర్తింపులు ఉండగా.. ఇప్పుడు సడెన్ గా రామారావు అని మాత్రమే పేరును మెన్షన్ చేయడం ఎందుకో ఎవరికీ అర్ధం కావడం లేదు. #RRR అంటూ హ్యాష్ ట్యాగ్ తో సినిమాను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనను రాజమౌళి చెప్పగానే.. వెంటనే ఓకె చెప్పేశాడట యంగ్ టైగర్. ఎందుకిలా చేశాడన్నదే ఎవరికీ అంతు చిక్కడం లేదు.

నిజానికి నందమూరి హీరో.. తారక్.. ఇప్పటివరకూ వాడేసినవే. అందరూ ఎన్టీఆర్ అనేందుకు ముందు జూనియర్ అంటున్నారు. జూనియర్ అనే పదాన్ని అవాయిడ్ చేయించాలనే ఆలోచన ఈ హీరోకు చాలా కాలం నుంచి ఉంది కానీ.. ఇప్పటివరకూ అది వర్కవుట్ కాలేదు.రామారావు ఈ వర్డ్ లో ఉన్న పవర్ ఎన్టీఆర్ కి తెలుసు. తన పేరుకే సొంత ఇమేజ్ ను.. దాంతో పాటే తాత పేరును కనెక్ట్ చేసుకుంటూ స్టెప్ తీసుకున్నాడట 'యంగ్ టైగర్ రామారావు'. 

Follow Us:
Download App:
  • android
  • ios