రేవంత్‌రెడ్డికి చెక్: అప్పుడు అన్న, ఇప్పుడు తమ్ముడు

By narsimha lodeFirst Published Dec 14, 2018, 6:55 PM IST
Highlights

 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి 10 వేలకు పైగా  ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి 10 వేలకు పైగా  ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.రేవంత్‌‌ను ఓడించేందుకు టీఆర్ఎస్ అనేక వ్యూహాలను రచించింది.ఈ వ్యూహలు ఫలించాయి.

రేవంత్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిలు 2014 ఎన్నికలకు ముందు వరకు టీడీపీలోనే ఉన్నారు. 2014 ఎన్నికలకు ముందు పట్నం మహేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, కేఎస్ రత్నంలు టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు.

ఆ సమయంలో  పట్నం మహేందర్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతేకాదు రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. కేఎస్ రత్నం చేవేళ్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. పట్నం నరేందర్ రెడ్డి పరిగి టీడీపీ ఇంచార్జీగా ఉన్నారు. ఈ ముగ్గురు ఎన్నికలకు ముందు టీడీపీని వీడి  టీఆర్ఎస్ లో చేరారు.

2014 ఎన్నికల్లో  రేవంత్ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాలని చివరి నిమిషం వరకు ప్రయత్నించారు.ఈ సీటును  మల్లారెడ్డికి ఇస్తానని చంద్రబాబు హమీ ఇచ్చారు. 

అయితే మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డికి రంగారెడ్డి జిల్లాలో టిక్కెట్టు ఎలా కేటాయిస్తారని ఆ సమయంలో  టీడీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మహేందర్ రెడ్డి పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

స్థానికేతర నేతలను తమ జిల్లాల్లోకి రాకుండా అడ్డుకొంటామని చెప్పారు. అయితే  మహేందర్ రెడ్డి  టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. ఆ తర్వాత  రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని చంద్రబాబునాయుడు నియమించారు. మల్కాజిగిరి పార్లమెంట్ టిక్కెట్టు విషయమై మంచిరెడ్డి కిషన్ రెడ్డి కూడ రేవంత్ రెడ్డిని వ్యతిరేకించారు.

2014 టిక్కెట్ల కేటాయింపు సమయంలో చంద్రబాబునాయుడు నివాసంలో  ఒకానొక దశలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం కూడ చోటు చేసుకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి కొడంగల్ నుండి  రెండో సారి  పోటీ చేయాల్సి వచ్చింది. రెండోసారి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన రేవంత్ రెడ్డి విజయం సాధించారు.

ఈ ఐదేళ్లలో రాజకీయ పరిణామాల్లో మార్పులు చోటు చేసుకొన్నాయి. రేవంత్ రెడ్డి గత ఏడాది టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కొడంగల్ లో పట్నం నరేందర్ రెడ్డిని టీఆర్ఎస్ బరిలోకి దింపాలని ఆనాడే ప్లాన్ చేసింది. ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిపై పట్నం నరేంద్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.

2014 ఎన్నికలకు ముందు టీడీపీలో ఉన్న సమయంలో రేవంత్‌ ను అడ్డుకొనే ప్రయత్నం చేసిన పట్నం సోదరులు... టీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఏకంగా రేవంత్ పై విజయం సాధించారు.

సంబంధిత వార్తలు

రేవంత్‌కు కొడంగల్ దెబ్బ: కేసీఆర్ పంతం, హరీష్ వ్యూహం

రాజకీయాల నుండి తప్పుకొంటా, రెడీనా: కేటీఆర్‌కు రేవంత్ సవాల్

కేసీఆర్‌కు రెండు చోట్ల ఓట్లెలా ఉన్నాయి: రేవంత్ రెడ్డి

రేవంత్ అరెస్ట్ ఓటర్లను ప్రభావితం చేసింది: లగడపాటి

లగడపాటి ఎగ్జిట్ పోల్స్: ప్రభుత్వ వ్యతిరేకత టీఆర్ఎస్‌కు నష్టం

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటిపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

టీఆర్ఎస్ తరపున లగడపాటి భార్య ప్రచారం

క్లూ ఇచ్చిన లగడపాటి: గజ్వేల్‌లో కేసీఆర్ డౌట్

కేటీఆర్‌కు ఆ విషయం చెప్పా, నేనేమీ మార్చలేదు: లగడపాటి

చంద్రబాబు కోసమే లగడపాటి సర్వే: కేటీఆర్ ట్వీట్

లగడపాటి సర్వే ఎఫెక్ట్: అసదుద్దీన్ తో కేసీఆర్ దోస్తీ అందుకే...

లగడపాటి అసలు సర్వే ఇదీ, నాకు పంపాడు: గుట్టు విప్పిన కేటీఆర్

లగడపాటి సర్వే సంకేతాలివే: కేసీఆర్ కు నో కేక్ వాక్

లగడపాటి సర్వే: మరో ముగ్గురు స్వతంత్రుల పేర్లు విడుదల

రేవంత్ కేసులో హైకోర్టుకు డిజిపి మహేందర్ రెడ్డి

రేవంత్ అరెస్ట్ ఎఫెక్ట్: వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణపై ఈసీ వేటు

డీజీపీ మా ముందుకు రావాలి...రేవంత్ అరెస్ట్‌పై హైకోర్టు ఆదేశం

రేవంత్ రెడ్డి అరెస్ట్: ఎందుకో రేపు చెబుతామన్న ఏజీ

దిగొచ్చిన పోలీసులు: కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలింపు

రేవంత్‌కు అస్వస్థత: వైద్యుల చికిత్స

డీజీపీకి షాక్: రేవంత్ విడుదలకు రజత్ కుమార్ ఆదేశాలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు

రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా

నీ కూతురి బెడ్‌రూమ్‌ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్

 

click me!
Last Updated Dec 14, 2018, 6:55 PM IST
click me!