''టీఆర్ఎస్ గెలుపుకు ఉత్తమ్ సహకారం....ఆయనో కోవర్ట్''

By Arun Kumar PFirst Published Dec 14, 2018, 6:38 PM IST
Highlights

తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రజాకూటమి ఘోర పరాభవాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ పరాజయం కారణంగా సొంత పార్టీ నాయకుల నుండే టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఉత్తమ్ టిపిసిసి అధ్యక్ష పదవి నుండి తొలగించాలని డిమాండ్స్ కూడా పెరుగుతున్నాయి. ఇలా  డిమాండ్ చేస్తున్న వారి జాబితాలోకి పిసిసి అధికార ప్రతినిధి గజ్జెల కాంతం కూడా చేరిపోయారు. 
 
ఉత్తమ్ వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటూ గజ్జెల కాంతం మండిపడ్డారు. హౌసింగ్ సొసైటీ కేసు నుండి తప్పించుకోడానికే ఉత్తమ్ టీఆర్ఎస్ కు సహకరించారని ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానానికి తప్పుడు సమాచారం అందిస్తూ చివరి నిమిషం వరకు పొత్తులు, టికెట్లు ఖరారు కాకుండా చూసి తీవ్ర నష్టాన్ని కల్గించారన్నారు. ఆయన కోవర్టుగా మారి టీఆర్ఎస్ గెలుపుకు సహకరించారని కాంతం తీవ్ర విమర్శలు చేశారు. 

అందువల్ల టిపిసిసి పదవి నుండి ఉత్తమ్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. బిసి లేదా ఎస్సి సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పగించాలని గజ్జెల కాంతం కాంగ్రెస్ హైకమాండ్ ను కోరారు. 

ఉత్తమ్‌పై గజ్జెల కాంతం చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సీరియస్ గా స్పందించారు. రేపటి లోగా తాను చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాంలంటూ గజ్జల కాంతంకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

click me!