Asianet News TeluguAsianet News Telugu

జయరామ్ హత్య: రెండు సార్లు తప్పించుకొని, రాకేష్ రెడ్డి ఉచ్చులోకి ఇలా..

 ప్రముఖ వ్యాపారవేత్త జయరామ్  ను రాకేష్ రెడ్డి రెండు దఫాలు హత్య చేయాలని ప్లాన్ చేసి మూడోసారి హనీ ట్రాప్ చేసి విజయం సాధించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

jayaram escapes from rakesh reddy two times
Author
Hyderabad, First Published Feb 19, 2019, 3:23 PM IST

హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త జయరామ్  ను రాకేష్ రెడ్డి రెండు దఫాలు హత్య చేయాలని ప్లాన్ చేసి మూడోసారి హనీ ట్రాప్ చేసి విజయం సాధించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జయరామ్ హత్య కేసులో రాకేష్ రెడ్డిని పలు కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.

జయరామ్ ను గత నెల 31వ తేదీన రాకేష్ రెడ్డి హత్య చేశారు. ఆ తర్వాత జయరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ విషయంలో కొందరు పోలీసులు తనకు  సహకరించినట్టుగా విచారణలో రాకేష్ రెడ్డి చెప్పినట్టు సమాచారం.

కోటీశ్వరుడైన జయరామ్ ను ట్రాప్ చేసి కోట్లాది రూపాయాలను లాగాలని రాకేష్ రెడ్డి ప్లాన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.జయరామ్ హత్యకు వారం రోజుల ముందే ప్లాన్ చేసినట్టుగా రాకేష్ రెడ్డి చెబుతున్నప్పటికీ అంతకుముందే అతడిని హత్య చేయాలని ప్లాన్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.

తొలిసారి జయరామ్ ను హత్య చేసే ప్రయత్నం ఫెయిల్ కావడంతో రెండో సారి రాకేష్ రెడ్డి తీరుపై జయరామ్ కు అనుమానం రావడంతో ఈ రెండు దఫాలు జయరామ్ హత్య చేయడానికి వీలు కాలేదని సమాచారం.

ఆ తర్వాత రాకేష్ రెడ్డి ఫోన్లు చేసినా కూడ జయరామ్ స్పందించలేదని తెలుస్తోంది. దీంతో రాకేష్ రెడ్డి ప్లాన్ మార్చారు. మూడోసారి వేరే వారి పేరుతో కొత్త సిమ్ ను తీసుకొని హనీ ట్రాప్ చేసి జయరామ్‌ను హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

రాకేష్ రెడ్డి రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టుగా జయరామ్ ను నమ్మించారు. గచ్చిబౌలిలో ఎకరం స్థలం ఉందని చౌకగా ఉందని జయరామ్ ను రాకేష్ రెడ్డి నమ్మించినట్టు సమాచారం. రూ.2 కోట్లు ఇస్తే ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయిస్తానని కూడ జయరామ్ కు చెబితే... సమయానికి డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో జయరామ్ వెనక్కు తగ్గినట్టు సమాచారం.

ఆ తర్వాత డబ్బుల కోసం రాకేష్ రెడ్డి జయరామ్ ను బెదిరించినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తాను అమెరికాకు వెళ్లేందుకు తనకు ఇబ్బందులు ఎదురౌతాయని భావించి వెనక్కు తగ్గినట్టు సమాచారం.

జయరామ్ అమెరికాలో ఉన్న సమయంలో కూడ రాకేష్ రెడ్డి ఎన్ని దఫాలు ఫోన్ చేసినా కూడ స్పందించలేదు. దీంతో జయరామ్ ను హత్య చేసేందుకు రాకేష్ రెడ్డి కొత్త నెంబర్ తో హనీ ట్రాప్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.హనీ ట్రాప్ కోసం రాకేష్ రెడ్డి మరో వ్యక్తిని ఉపయోగించుకొన్నట్టుగా అనుమానిస్తున్నారు. రాకేష్ రెడ్డికి కనీసం బ్యాంక్ ఖాతా కూడ లేదని పోలీసులు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

జయరామ్ హత్య: రాకేష్ రెడ్డి చిల్లిగవ్వ ఇవ్వలేదు

జయరామ్ హత్య: మరో ఇద్దరి అరెస్ట్, ఐదుగురు పోలీసుల విచారణ

ముగ్గురు పోలీసులతో రాకేష్ రెడ్డి ఫోన్లో సంభాషణలు

రాకేష్ రెడ్డి భూ దందాలు: సహకరించిన పోలీసులకు గిప్ట్స్

తెలియక ఇరుక్కున్న నటుడు సూర్య: సినీతారలతో రాకేష్ రెడ్డికి లింక్స్

శిఖా చౌదరితో రాకేష్ ప్రేమాయణం: జయరామ్ ప్రాణాలకు ఎసరు పెట్టింది అదే

జయరామ్ హత్య: నటుడు సూర్యతో హానీట్రాప్

జయరామ్ హత్యలో నగేష్ పాత్ర: ఖాళీ బాండ్‌ పేపర్లపై సంతకాలు

జయరామ్ హత్య కేసు: ఏసీపీ ఆఫీసులో శిఖా చౌదరి విచారణ

జయరామ్ హత్య: అప్పు ఉత్తి మాటే, బలవంతపు వసూలుకే

జయరామ్ హత్య: జూ.ఆర్టిస్ట్ సహా మరో 9 మంది పోలీసుల పాత్రపై ఆరా

జయరామ్ మృతదేహంతో హైద్రాబాద్‌లో రాకేష్ రెడ్డి చక్కర్లు

జయరామ్ హత్య కేసు: జూబ్లీహిల్స్‌కు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి

జయరామ్ హత్య కేసు: ఆర్థిక లావాదేవీలపై పోలీసుల ఆరా

జయరామ్ హత్య‌ కేసు: పోలీస్ కస్టడీకి రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ కు జయరాం హత్యకేసు నిందితులు

ఎన్నిసార్లు ఫోన్ చేసినా జయరామ్ స్పందించలేదు: పద్మశ్రీ

అలా చెప్పడంతో కీడును శంకించింది: జయరామ్ భార్య

భర్త లేకుండా తొలిసారి పెళ్లి రోజు: జయరామ్ భార్య ఆవేదన

శిఖా చౌదరే చంపించింది, దేవుడు చెప్పినా నమ్మను: జయరామ్ భార్య

ఆర్డర్ రాలేదు, మొదటి నుండి దర్యాప్తు: హైద్రాబాద్ సీపీ

జయరామ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ

పద్మశ్రీ ఫిర్యాదు: జయరామ్ హత్యకేసుపై టీ. పోలీసుల మల్లగుల్లాలు

జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్: తెలంగాణ పోలీసులను అశ్రయించిన పద్మశ్రీ

జయరామ్‌ హత్యకేసు: శిఖా చౌదరికి క్లీన్ చిట్

జయరామ్ హత్య కేసు: నిందితులను ఎలా పట్టుకొన్నారంటే

19 గంటలు నిర్భంధం: జయరామ్‌కు రాకేష్ చిత్రహింసలు

శిఖా చౌదరికి చెక్: సంస్థలపై పట్టు కోసం జయరామ్ భార్య

శిఖా చౌదరి ప్రమేయంతోనే నా భర్త హత్య : జయరామ్ భార్య

జయరామ్ హత్య కేసు:తెలంగాణ ఏపీసీపై వేటు

జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్

జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

 

Follow Us:
Download App:
  • android
  • ios