అలా చెప్పడంతో కీడును శంకించింది: జయరామ్ భార్య

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 7, Feb 2019, 3:20 PM IST
coastal bank md informed me on jayaram's death says padmasri
Highlights

అమెరికా సమయం ప్రకారంగా ఈ ఏడాది జనవరి 31వ తేదీ రాత్రి జయరామ్‌కు రోడ్డు ప్రమాదం జరిగిందని కోస్టల్ బ్యాంకు ఎండీ తనకు సమాచారం ఇచ్చాడని  జయరామ్ భార్య పద్మశ్రీ చెప్పారు.

హైదరాబాద్: అమెరికా సమయం ప్రకారంగా ఈ ఏడాది జనవరి 31వ తేదీ రాత్రి జయరామ్‌కు రోడ్డు ప్రమాదం జరిగిందని కోస్టల్ బ్యాంకు ఎండీ తనకు సమాచారం ఇచ్చాడని  జయరామ్ భార్య పద్మశ్రీ చెప్పారు.

ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను ఆమె వెల్లడించారు. తనకు ఈ విషయమై వాట్సాప్‌లోనే కోస్టల్ బ్యాంకు ఎండీ సమాచారాన్ని ఇచ్చారని ఆమె గుర్తు చేసుకొన్నారు. ఆ తర్వాత రెండు గంటలకు జయరామ్ లేరని భావించి  అమెరికా నుండి తిరిగి రావాలని  తనకు సమాచారం ఇచ్చారని చెప్పారు.

అయితే ఈ సమాచారం వల్ల  జయరామ్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఉంటారని భావించినట్టుగా ఆమె అభిప్రాయపడ్డారు. తన భర్త ఆసుపత్రిలో కొన ఊపిరితో ఉన్నారని  ఆశతో ఉన్నామని చెప్పారు.

ఖచ్చితంగా పిల్లలను  తీసుకురావాలని కోస్టల్ బ్యాంకు ఎండీ చెప్పడంతో తన మనసు కీడును శంకించినట్టుగా ఆమె చెప్పారు. హైద్రాబాద్ నుండి కోస్టల్ బ్యాంకు ఎండీ నందిగామ బయలుదేరే ముందు తనతో మాట్లాడారని చెప్పారు. నందిగామ వెళ్లిన సమయంలో   కోస్టల్ బ్యాంకు ఎండీ  తాను ఈ విషయాన్ని నాతో చెప్పలేక డ్రైవర్‌తో చెప్పించినట్టు ఆమె గుర్తు చేసుకొన్నారు.

డ్రైవర్ సతీష్ ఫోన్ చేయగానే జయరామ్  ఆరోగ్యం ఎలా ఉంది, ఆసుపత్రిలోనే కదా ఉన్నారని తాను పదే పదే డ్రైవర్ సతీష్‌ను అడుగుతోంటే.... సమాధానం చెప్పలేక సార్... మనకిక లేరమ్మా... అంటూ సతీష్ చెప్పారన్నారు.

సతీష్ నీవే కదా డ్రైవ్ చేశావు... ఎలా ఉంది అని అడిగితే సతీష్ సార్.. లేడనే సమాధానం చెప్పారన్నారు.  మా నాన్న కూడ నాకు ఫోన్ చేసి రావాలని చెప్పాడని ఆమె గుర్తు చేసుకొన్నారు. హైద్రాబాద్‌లోని ఇంటికి వచ్చాకే జయరామ్ హత్యకు గురైనట్టుగా తనకు తెలిసిందని  ఆమె చెప్పారు. 

సంబంధిత వార్తలు

భర్త లేకుండా తొలిసారి పెళ్లి రోజు: జయరామ్ భార్య ఆవేదన

శిఖా చౌదరే చంపించింది, దేవుడు చెప్పినా నమ్మను: జయరామ్ భార్య

ఆర్డర్ రాలేదు, మొదటి నుండి దర్యాప్తు: హైద్రాబాద్ సీపీ

జయరామ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ

పద్మశ్రీ ఫిర్యాదు: జయరామ్ హత్యకేసుపై టీ. పోలీసుల మల్లగుల్లాలు

జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్: తెలంగాణ పోలీసులను అశ్రయించిన పద్మశ్రీ

జయరామ్‌ హత్యకేసు: శిఖా చౌదరికి క్లీన్ చిట్

జయరామ్ హత్య కేసు: నిందితులను ఎలా పట్టుకొన్నారంటే

19 గంటలు నిర్భంధం: జయరామ్‌కు రాకేష్ చిత్రహింసలు

శిఖా చౌదరికి చెక్: సంస్థలపై పట్టు కోసం జయరామ్ భార్య

శిఖా చౌదరి ప్రమేయంతోనే నా భర్త హత్య : జయరామ్ భార్య

జయరామ్ హత్య కేసు:తెలంగాణ ఏపీసీపై వేటు

జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్

జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

 

loader