కోస్టల్ బ్యాంక్ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం చౌదరి హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. రాకేశ్ రెడ్డి అనే వ్యక్తి వద్ద జయరాం రూ. 4.5 కోట్లు అప్పు తీసుకున్నారు. దీనికి సంబంధించిన విభేదాల కారణంగా రాకేశ్ రెడ్డి ఆయనను చంపినట్లు సమాచారం.

జయరాంను హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకెళుతూ కారులోనే రాకేశ్ రెడ్డి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కారు వెనుక సీట్లోనే కొట్టి చంపినట్లు భావిస్తున్నారు. మద్యం మత్తులో ఉండగానే హత్య చేసి దీనిని ప్రమాదంగా చిత్రీకరించి ఐతవరం వద్ద రోడ్డు పక్కన కారును వదిలి రాకేశ్ రెడ్డితో పాటు మరో వ్యక్తి పారిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు.

మాదాపూర్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ నుంచి రాకేశ్ రెడ్డి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. ఈ హత్యలో జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి పాత్ర ఉందా లేదా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

రాకేశ్‌రెడ్డి.. శిఖా చౌదరికి బాయ్‌ఫ్రెండ్ అతని వద్ద నుంచి ఆమె రూ.4.5 కోట్లు అప్పు తీసుకుంది. వీరిద్దరి మధ్య రుణం విషయమై గత కొంతకాలంగా గొడవ జరుగుతూ వస్తోంది. ఈ సందర్భంలోనే మేనకోడలి డబ్బును తాను చెల్లిస్తానని చిగురుపాటి సెటిల్‌మెంట్ చేశాడని తెలుస్తోంది.

డబ్బు తీసుకుంది శిఖా చౌదరి.. అప్పు తీర్చాల్సింది కూడా ఆమె. అలాంటప్పుడు శిఖా చౌదరిని వదిలిపెట్టి జయరామ్‌ను రాకేశ్ రెడ్డి ఎందుకు చంపాడన్నది అంతుచిక్కని ప్రశ్న. నందిగామ పోలీస్ స్టేషన్‌లో ఉన్న శిఖా చౌదరిని కలవడానికి కబాలి చిత్ర నిర్మాత కెపి చౌదరి ఎందుకొచ్చాడు.

శిఖా చౌదరి తల్లి సుశీలను పీఎస్‌కు ఎందుకు పిలిపించారు... ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. శిఖాను ఈ కేసు నుంచి తప్పించడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది.

చిగురుపాటి జయరామ్‌కు సంబంధించిన ఆర్ధిక లావాదేవీలన్నీ శిఖా చౌదరి కనుసన్నల్లోనే ఉండటం ఇంకా ఆమె పోలీసుల అదుపులోనే ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది.   

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

చిగురుపాటి హత్య: డ్రైవర్ ట్విస్ట్, ఇంటి సిసీటీవీ ఫుటేజీల పరిశీలన

జయరామ్ మర్డర్ కేసు: మేన కోడలును విచారించనున్న పోలీసులు

పరారీలో డ్రైవర్, విషప్రయోగం చేశారా: జయరామ్‌ మృతిలో అనుమానాలు

కారులో పారిశ్రామికవేత్త జయరామ్ శవం: హత్యగా అనుమానాలు (వీడియో)

నందిగామలో కారులో మృతదేహం: ఎక్స్‌ప్రెస్‌ టీవీ అధినేతగా గుర్తింపు