గుంటూరు: 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నరసరావు పేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు నాయుడుని ఎంపీ టికెట్ తో పాటు తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని అడిగినట్లు తెలిపారు. 

తమ కుటుంబం గుంటూరు జిల్లాలో కష్టపడి పనిచేస్తున్న కుటుంబమని తాము టికెట్ అడగడంలో ఎలాంటి తప్పులేదని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. 

నిజాయితీగా పనిచెయ్యడం తమకు తెలిసిన రాజకీయమన్నారు. పదవుల కోసం గడ్డి తినే వ్యక్తులం కాదని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి గతంలో ఎప్పుడూ జరగలేదని చెప్పారు.