హైదరాబాద్: ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసు ముగ్గురి చుట్టూ తిరుగుతోంది. చిగురుపాటి జయరాం మేనకోడలు శిఖా చౌదరిని ప్రధానంగా పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో రాకేష్ రెడ్డి అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

రాకేష్ రెడ్డికి శిఖా చౌదరి రూ.4.5 కోట్లు అప్పు పడిందని, ఆ అప్పు తీరుస్తానని చిగురుపాటి జయరాం చెప్పాడని అంటున్నారు. జయరాం హత్య కేసు ముగ్గురి చుట్టూ తిరుగుతోంది. శిఖా చౌదరి, శ్రీకాంత్, రాకేష్ అనే ముగ్గురి చుట్టూ తిరుగుతోంది. జయరాం మరణించాడని తెలిసిన రోజు ఉదయమే శ్రీకాంత్ ను వెంట పెట్టుకుని శిఖా చౌదరి ఆయన ఇంటికి వెళ్లింది.

శ్రీకాంత్ శిఖా చౌదరి బాయ్ ఫ్రెండ్ అని వార్తలు వస్తున్నాయి. శిఖా చౌదరికి రాకేష్ రెడ్డితోనూ శ్రీకాంత్ తోనూ ఉన్న సంబంధాలేమిటనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. వారితో పాటు గుంటూరు జిల్లాకు చెందిన ఓ పార్లమెంటు సభ్యుడి తమ్ముడి కుమారుడి పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 

శ్రీకాంత్ ను వెంటపెట్టుకుని శిఖా చౌదరి జయరాం ఇంటికి వెళ్లింది. వారిద్దరు జయరాం ఇంటిలోని బెడ్రూంలో వెతకడం సాగించారు. ఆ సమయంలో కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ ఫోన్ చేసి ఇంట్లోకి ఎవరినీ రానీయవద్దని వాచ్ మన్ కు చెప్పాడు. దీంతో వాచ్ శిఖా చౌదరిని వెనక్కి పంపించినట్లు చెబుతున్నారు. 

జయరాం ఇంటి తాళాల కోసం శిఖా చౌదరి వాచ్ మన్ తో గొడవ పడినట్లు కూడా చెబుతున్నారు. మొత్తం మీద, జయరాం హత్య కేసులో పలు కోణాలు వెలుగు చూస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

చిగురుపాటి హత్య: డ్రైవర్ ట్విస్ట్, ఇంటి సిసీటీవీ ఫుటేజీల పరిశీలన

జయరామ్ మర్డర్ కేసు: మేన కోడలును విచారించనున్న పోలీసులు

పరారీలో డ్రైవర్, విషప్రయోగం చేశారా: జయరామ్‌ మృతిలో అనుమానాలు

కారులో పారిశ్రామికవేత్త జయరామ్ శవం: హత్యగా అనుమానాలు (వీడియో)

నందిగామలో కారులో మృతదేహం: ఎక్స్‌ప్రెస్‌ టీవీ అధినేతగా గుర్తింపు