హైదరాబాద్: ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో హైదరాబాదులోని దస్పల్లా హోటల్ కీలకంగా మారింది. దస్పల్లా హోటల్ లోని సీసీటీవి ఫుటేజీలను నందిగామ పోలీసులు పరిశీలించారు. ఆ సీసీటీవి ఫుటేజీని వారు స్వాధీనం చేసుకున్నారు. ఆ హోటల్లోనే ఓ తెల్ల చొక్కా వేసుకున్న వ్యక్తి జయరాంను కలిసినట్లు పోలీసులు గుర్తించారు. 

జనవరి 31వ తేదీన హోటల్లో ఫార్మా కంపెనీ సమావేశం జరిగింది. ఆ సమావేశం ముగిసిన తర్వాత ఓ తెల్ల చొక్కా వేసుకున్న వ్యక్తి జయరాంను తన వెంట తీసుకుని వెళ్లినట్లు భావిస్తున్నారు. అతను మాయమాటలు చెప్పి జయరాంను తన వెంట తీసుకుని వెళ్లి ఉండవచ్చునని అనుకుంటున్నారు. అతని ఆచూకీ కోసం పోలీసులు వేట ప్రారంభించారు. దస్పల్లా హోటల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

జయరాం హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మేనకోడళ్లను, అక్కను పోలీసులు ప్రశ్నించారు. జయరాం భార్యాపిల్లలను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. జయరాం గుండెలో మూడు స్టంట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

జయరాం మృతదేహాన్ని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో భద్రపరిచారు. ఆయన అంత్యక్రియలు రేపు హైదరాబాదులో జరుగుతాయి.  

సంబంధిత వార్తలు

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

చిగురుపాటి హత్య: డ్రైవర్ ట్విస్ట్, ఇంటి సిసీటీవీ ఫుటేజీల పరిశీలన

జయరామ్ మర్డర్ కేసు: మేన కోడలును విచారించనున్న పోలీసులు

పరారీలో డ్రైవర్, విషప్రయోగం చేశారా: జయరామ్‌ మృతిలో అనుమానాలు

కారులో పారిశ్రామికవేత్త జయరామ్ శవం: హత్యగా అనుమానాలు (వీడియో)

నందిగామలో కారులో మృతదేహం: ఎక్స్‌ప్రెస్‌ టీవీ అధినేతగా గుర్తింపు