హైదరాబాద్: హత్యకు గురైన ఎన్నారై చిగురుపాటి జయరాం ఇంటి వాచ్ మన్ కీలకమైన విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. అతను వెల్లడించిన అంశాల ఆధారంగానే జయరాం మేనకోడలు శిఖా చౌదరిని, సోదరి సుశీల చౌదరిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. నందిగామ పోలీసులు జగ్గయ్యపేటలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీ అతిథిగృహంలో వారిని విచారిస్తున్నట్లు సమాచారం.

నిన్న (శుక్రవారం) ఉదయం 6 గంటలకు శిఖా చౌదరి ఇంటికి వచ్చారని, తాళం చెవులు ఇవ్వాలని తనతో గొడవకు దిగారని జయరాం ఇంటి వాచ్ మన్ వెంకటేష్ చెబుతున్నాడు. ఇంటికి వచ్చినప్పుడు శిఖా చౌదరి కంగారుగా కనిపించారని అతను ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో చెప్పాడు.

శిఖా చౌదరి వెంట శ్రీకాంత్ అనే యువకుడు కూడా వచ్చినట్లు అతను తెలిపాడు. బ్యాంక్ డాక్యుమెంట్ల కోసం ఇల్లంతా గాలించారని అతను చెప్పాడు. నందిగామ పోలీసులకు అన్ని విషయాలూ చెప్పినట్లు తెలిపాడు.

పోలీసులు శిఖా చౌదరి సోదరి మనీషాను కూడా విచారిస్తున్నట్లు సమాచారం. శిఖా చౌదరి స్నేహితుడు రాకేష్ కు సర్దుబాటు చేయాల్సిన సొమ్ము విషయంలోనే గొడవ జరిగినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

చిగురుపాటి హత్య: డ్రైవర్ ట్విస్ట్, ఇంటి సిసీటీవీ ఫుటేజీల పరిశీలన

జయరామ్ మర్డర్ కేసు: మేన కోడలును విచారించనున్న పోలీసులు

పరారీలో డ్రైవర్, విషప్రయోగం చేశారా: జయరామ్‌ మృతిలో అనుమానాలు

కారులో పారిశ్రామికవేత్త జయరామ్ శవం: హత్యగా అనుమానాలు (వీడియో)

నందిగామలో కారులో మృతదేహం: ఎక్స్‌ప్రెస్‌ టీవీ అధినేతగా గుర్తింపు