19 గంటలు నిర్భంధం: జయరామ్‌కు రాకేష్ చిత్రహింసలు

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 5, Feb 2019, 3:35 PM IST
jayaram was harassed 19 hours by rakesh reddy
Highlights

 19 గంటల పాటు జయరామ్‌ను రాకేష్ రెడ్డి చిత్రహింసలు పెట్టిన తర్వాత  హత్య చేశారని పోలీసుల విచారణలో రాకేష్ రెడ్డి ఒప్పుకొన్నట్టు సమాచారం. రీనా అనే మహిళ పేరుతో  రాకేష్ రెడ్డి జయరామ్‌కు వల వేశారు

హైదరాబాద్:  19 గంటల పాటు జయరామ్‌ను రాకేష్ రెడ్డి చిత్రహింసలు పెట్టిన తర్వాత  హత్య చేశారని పోలీసుల విచారణలో రాకేష్ రెడ్డి ఒప్పుకొన్నట్టు సమాచారం. రీనా అనే మహిళ పేరుతో  రాకేష్ రెడ్డి జయరామ్‌కు వల వేశారు.

గత నెల 30 వ తేదీన జయరామ్‌ను ఇంటికి  రావాలని  రీనా పేరుతో  రాకేష్ రెడ్డి జయరామ్‌తో చాటింగ్ చేశారు. తన ఇంట్లో ఎవరూ లేరని రావాల్సిందిగా కోరారు.అమ్మాయిల బలహీనత ఉన్న జయరామ్‌ ఈ చాటింగ్‌ ఆధారంగా రాకేష్ రెడ్డి ఇంటికి చేరుకొన్నాడు. 

అయితే డ్రైవర్ సహా ఎవరూ లేకుండా ఒంటరిగా రావాలని కోరడంతో   ఒంటరిగానే  ఆయన అక్కడికి చేరుకొన్నాడు. రీనా చెప్పిన అడ్రస్ రాకేష్ రెడ్డి ఇల్లుగా గుర్తించిన జయరామ్  తిరిగి వెళ్లే లోపుగానే రాకేష్ రెడ్డి  అనుచరుడు జయరామ్‌ను బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లాడు.

తనకు ఇవ్వాల్సిన నాలుగున్నర కోట్ల రూపాయాల గురించి రాకేష్ రెడ్డి జయరామ్‌ను నిలదీశాడు. ఈ విషయమై రాకేష్ రెడ్డి జయరామ్‌పై పిడిగుద్దులు గుద్దినట్టు పోలీసుల విచారణలో ఒప్పుకొన్నట్టు తెలుస్తోందని   ఓ టీవీ ఛానెల్ కథనాన్ని ప్రసారం చేసింది.

30వ తేదీన రాకేష్ రెడ్డి ఇంటికి చేరుకొన్న జయరామ్‌ను 19 గంటల పాటు అక్కడే బంధించి చిత్రహింసలు పెట్టారు. జయరామ్ ఫోన్ చేయడంతో రూ.6 లక్షలను రాకేష్ రెడ్డి మనిషికి ఈశ్వర ప్రసాద్ ఓ హోటల్ రూమ్‌లో అప్పగించారు.

అయితే నాలుగున్నర కోట్లు చెల్లించాల్సి ఉంటే కేవలం నాలుగున్నర లక్షలే చెల్లించడంపై రాకేష్ రెడ్డి  ఆగ్రహంతో ఊగిపోయారు.కోపాన్ని పట్టలేక దిండుతో జయరామ్ ముఖంపై అదమడంతో ఆయన చనిపోయినట్టుగా విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

శిఖా చౌదరికి చెక్: సంస్థలపై పట్టు కోసం జయరామ్ భార్య

శిఖా చౌదరి ప్రమేయంతోనే నా భర్త హత్య : జయరామ్ భార్య

జయరామ్ హత్య కేసు:తెలంగాణ ఏపీసీపై వేటు

జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్

జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

 

loader