నందిగామ: ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో శిఖా చౌదరి పాత్ర లేదని  ఎస్పీ త్రిపాఠీ స్పష్టం చేశారు.ఈ కేసులో నిందితుడు చెప్పిన అంశాలను మాత్రమే చెప్పారు. కానీ, దర్యాప్తులో తేలిన అంశాలను మాత్రం చెప్పలేదు. మరోవైపు దీనికి సంబంధించిన ఆధారాలు లేవని పోలీసులు చెప్పారు.

చిగురుపాటి జయరామ్‌‌ హత్య కేసులో రాకేష్ రెడ్డి తో పాటు వాచ్‌మెన్‌‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జయరామ్‌ హత్య కేసులో  శిఖా చౌదరి పాత్ర ఉంటుందని పద్మశ్రీ అనుమానాలు వ్యక్తం చేశారు.

జయరామ్ హత్య కేసులో శిఖా చౌదరి పాత్ర లేదని పోలీసులు లేదని తేల్చితే  తాను న్యాయపోరాటం చేస్తానని పద్మశ్రీ  ప్రకటించారు.జయరామ్‌ భార్య పద్మశ్రీ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం గురించి పోలీసులు ప్రస్తావించారు. శిఖా చౌదరి తల్లి సుశీలపై ఆమె కుటుంబంపై పద్మశ్రీ ఆరోపణలు చేసింది.

జయరామ్ కంపెనీల్లో శిఖా చౌదరి డైరెక్టర్‌గా, వాటాదారునిగా ఉంది. దీంతో జయరామ్ భార్య పద్మశ్రీ  బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసి శిఖా చౌదరిని తొలగించేందుకు పద్మశ్రీ ప్లాన్ చేసింది.

తన వద్ద తీసుకొన్న అప్పుగా డబ్బులను ఇవ్వని కారణంగానే రాకేష్ రెడ్డి కోపంలో జయరామ్‌ను హత్య చేసినట్టుగా కృష్ణా జిల్లా పోలీసులు ప్రకటించారు. మరో వైపు  ఈ కేసులో శిఖా చౌదరి పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని  ఎస్పీ ప్రకటించారు. శిఖా చౌదరి గురించి మీడియా ప్రతినిధులు పదే పదే ప్రకటించడంతో పోలీసులు అసహనం వ్యక్తం చేశారు.

తమ వద్ద ఉన్న ఆధారాల మేరకు శిఖా చౌదరికి ఎలాంటి సంబంధం లేదన్నారు. శిఖా చౌదరిని ఈ కేసు నుండి తప్పించాల్సిన అవసరం లేదని ఎస్పీ త్రిపాఠి ప్రకటించారు. మరో వైపు ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను ఇంకా సేకరించాల్సి ఉందని పోలీసులు ప్రకటించడం కూడ గమనార్హం.

జయరామ్‌ కేసులో ఛేదించేందుకు  నందిగామ డిఎస్పీ ఆధ్వర్యంలో  ఏర్పాటైన నాలుగైదు పోలీసు టీమ్‌లు హైద్రాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో నిర్వహించిన విచారణలో ఏం తేల్చలేదు. అయితే ఇంత కీలకమైన కేసులో పోలీసులు ఎందుకు ఆధారాలను సేకరించలేకపోయారోననే  విషయం అర్ధం కావడం లేదు.

శిఖా చౌదరికి, రాకేష్ రెడ్డికి కూడ సంబంధాలు ఉన్న విషయాన్ని పోలీసులు ప్రకటించారు. అయితే మూడు మాసాలుగా వీరిద్దరి మధ్య సంబంధాలు తెగిపోయాయని ఎస్పీ ప్రకటించారు. అయితే గత ఏడాది జనవరిలో రాకేష్ రెడ్డి, శిఖా చౌదరి మధ్య పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు.

దుబాయ్‌ లాంటి దేశాలకు శిఖా చౌదరి, రాకేష్ రెడ్డి  కూడ వెళ్లినట్టుగా కూడ ఎస్పీ త్రిపాఠీ ప్రకటించారు. అయితే ఈ విషయం ఈ కేసుతో సంబంధం లేదన్నారు. అయితే ఈ కేసు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని  పోలీసులు చెప్పారు. 

మరో వైపు ఈ కేసులో శిఖా చౌదరి పాత్ర గురించి పోలీసులు ఎందుకు దర్యాప్తు చేయలేదనే విషయమై అనుమానాలు కూడ వ్యక్తమౌతున్నాయి.జయరామ్ భార్య పద్మశ్రీతో పాటు గుత్తా పిచ్చయ్య చౌదరి కూడ శిఖా చౌదరి పై అనుమానాలు వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

జయరామ్ హత్య కేసు: నిందితులను ఎలా పట్టుకొన్నారంటే

19 గంటలు నిర్భంధం: జయరామ్‌కు రాకేష్ చిత్రహింసలు

శిఖా చౌదరికి చెక్: సంస్థలపై పట్టు కోసం జయరామ్ భార్య

శిఖా చౌదరి ప్రమేయంతోనే నా భర్త హత్య : జయరామ్ భార్య

జయరామ్ హత్య కేసు:తెలంగాణ ఏపీసీపై వేటు

జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్

జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?