అమరావతి: ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరామ్‌ను  పకడ్బందీ ప్లాన్  చేసి హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. హైద్రాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో  ఓ యాంకర్‌‌ను జయరామ్ కలుసుకొన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే జయరామ్‌ను రప్పించేందుకు యాంకర్ ద్వారా ఫోన్ చేశారా  అనే  కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వ్యాపారవేత్త జయరామ్ హత్య కేసులో   పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ఇంకా  పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. జయరామ్ హత్య కేసులో ఇప్పటికే శిఖా చౌదరిని పోలీసులు విచారిస్తున్నారు. 

శిఖా చౌదరి మాజీ ప్రియుడు రాకేష్ రెడ్డే ఈ హత్య చేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. జయరామ్‌ బలహీనతలను తనకు అనుకూలంగా రాకేష్ రెడ్డి మార్చుకొన్నాడు. 

తన వద్ద తీసుకొన్న అప్పును  జయరామ్ తిరిగి చెల్లించని కారణంగా ఆయనను కలుసుకొనేందుకు రాకేష్ రెడ్డి  జయరామ్‌ బలహీనతలను ఉపయోగించుకొన్నారని అనుమానిస్తున్నారు. అయితే ఈ దిశగా కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.జయరామ్‌‌కు  యాంకర్‌కు మధ్య ఉన్న సంబంధం ఏమిటనే విషయమై పోలీసులు కూడ ఆరా తీస్తున్నారు.

గత నెల 30వ తేదీన జయరామ్‌ హైద్రాబాద్‌లోని తన నివాసం ఉండి బయటకు వచ్చారు. ఆ తర్వాత 31 గంటల పాటు  జయరామ్ ఎక్కడ ఉన్నాడనే  విషయమై కూడ పోలీసులు శాస్త్రీయమైన ఆధారాలను సేకరించారు.  

 జయరామ్‌ దస్‌పల్లా హోటల్‌లోని ఓ గదిలో చాలాసేపు ఉన్నారు. ఆయనతోపాటు ఓ మహిళ ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 10లోని  ఓ హోటల్‌కు కూడా వెళ్లినట్లు నిర్ధారించుకున్నారు.

సంబంధిత వార్తలు

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?